Movie News

చెంప దెబ్బ ఫ‌లితం.. విల్ స్మిత్ అరెస్ట్?

ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేదిక‌పై అనూహ్య సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తొలిసారిగా ఉత్త‌మ న‌టుడిగా ఆస్కార్ పుర‌స్కారం అందుకున్న సూప‌ర్ స్టార్ విల్ స్మిత్.. త‌న భార్య మీద జోక్ పేల్చినందుకు వ్యాఖ్యాత‌, క‌మెడియ‌న్ క్రిస్ రాక్  చెంప ప‌గ‌ల‌గొట్ట‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఒక వ్యాధి కార‌ణంగా స్మిత్ భార్య జుట్టు మొత్తం ఊడిపోగా.. హీరోయిన్ గుండుతో క‌నిపించే ఓ సినిమాకు ఆమె సీక్వెల్ చేయ‌బోతోందా అంటూ రాక్ జోక్ పేల్చ‌డం స్మిత్‌కు న‌చ్చ‌లేదు. ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక వెంట‌నే వేదిక మీదికెళ్లి రాక్ చెంప చెల్లుమ‌నిపించేశాడు స్మిత్. ఈ విష‌యంలో చాలామంది స్మిత్‌ను స‌మ‌ర్థించారు. సీరియ‌స్ విష‌యాల‌పై జోకులేస్తే ఇలాగే స్పందించాల‌న్నారు.

అదే సమ‌యంలో స్మిత్ మరీ అంత దురుసుగా ప్ర‌వ‌ర్తించాల్సింది కాద‌న్న అభిప్రాయం కొంద‌రిలో వ్య‌క్త‌మైంది. ఐతే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.. బ‌హిరంగ వేదిక‌లో ఒక వ్య‌క్తిపై చేయి చేసుకున్నందుకు స్మిత్ అరెస్ట్ కాబోతున్న‌ట్లుగా మీడియాలో వార్త‌లొస్తున్నాయి.
స్మిత్‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆస్కార్ అవార్డుల క‌మిటీనే ముందుగా నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా అకాడ‌మీ గ‌వ‌ర్న‌ర్ల బోర్డు తాజాగా స‌మావేశమై స్మిత్ ప్ర‌వ‌ర్త‌నను తీవ్రంగా ఖండించింది. స్మిత్‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు ఈ స‌మావేశానంతరం క‌మిటీ ప్రతినిధి ఒక‌రు ప్ర‌క‌టించారు. పోలీసులు స్మిత్‌ను అరెస్ట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని, ఎప్పుడైనా అత‌డి అరెస్ట్ ఉండొచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మ‌రోవైపు ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క వేడుక‌లో, వేదిక మీద ఒక నామినీ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని తాము జీర్ణించుకోలేక‌పోయామ‌ని, ఇది ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని, స్మిత్ హ‌ద్దు మీరాడ‌ని అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పేర్కొంది. స్మిత్ ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల.. రాక్‌కు ఈ సంస్థ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఆ స‌మ‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించినందుకు రాక్‌ను అభినందించింది. స్మిత్‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆ సంస్థ అకాడ‌మీకి సూచించిన నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ల బోర్డు స‌మావేశ‌మైంది.

This post was last modified on April 2, 2022 10:19 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago