గత కొన్నేళ్లలో భారతీయ చిత్రాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే పారితోషకాలూ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఐతే రెమ్యూనరేషన్ల సంగతి తీసుకుంటే ఎప్పుడూ హీరోలదే ఆధిపత్యం. ఇప్పుడు ఇండియాలో వంద కోట్ల పారితోషకం అందుకునే హీరోలు కూడా ఉన్నారు. మన ప్రభాస్ సైతం ఆ క్లబ్బులో ఉండటం విశేషం. ఐతే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల పారితోషకాలు చాలా తక్కువనే చెప్పాలి.
పది కోట్లకు పైగా పారితోషకం అందుకునే హీరోయిన్లను వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు. ఈ జాబితాలో ఉన్నది బాలీవుడ్ హీరోయిన్లే. దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి కొందరు హీరోయిన్లు ఈ క్లబ్బులో ఉన్నారు. వీళ్లు పది కోట్ల క్లబ్బులో చేరినపుడే ఔరా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆలియా ఏకంగా 20 కోట్ల క్లబ్బులో చేరిన తొలి భారతీయ కథానాయిక రికార్డు సృష్టించడం విశేషం.
కొన్ని రోజులుగా భారతీయ సినీ పరిశ్రమలో ఆలియా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణంగా ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాలో ఆమె ఇచ్చిన అదిరిపోయే పెర్ఫామెన్సే. ముందు ఈ పాత్రను ఆలియా ఏమాత్రం చేయగలదో అని సందేహించిన వాళ్లంతా కూడా సినిమా చూశాక ఆమె నటనకు ఫిదా అయిపోయారు. పెర్ఫామెన్స్ పరంగా ఆమె ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసిందనే చెప్పాలి.
అందుకే తన కష్టానికి తగ్గ పారితోషకమే ఇచ్చాడట దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ. ‘గంగూబాయి’ సినిమాకు గాను ఆలియా రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇండియన్ సినిమాలో ఇంకే హీరోయిన్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో క్యామియో తరహా పాత్ర చేసిన అజయ్ దేవగణ్ రూ.11 కోట్లు పుచ్చుకున్నాడట. మంచి టాక్, రివ్యూలు తెచ్చుకున్న ‘గంగూబాయి’.. చక్కటి వసూళ్లతో సాగిపోతోంది.
This post was last modified on March 2, 2022 9:29 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…