Movie News

ఓటీటీ పై అతిపెద్ద రియాల్టీ షో గా నిలిచిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌

ఓటీటీ పై అతిపెద్ద రియాల్టీ షో ప్రారంభానికి ప్రతీకగా నిలిచిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఒక మిలియన్‌కు పైగా వీక్షణలతో రికార్డు.

డిస్నీ+హాట్‌స్టార్‌ పై నూతన రికార్డును సృష్టిస్తూ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అత్యధిక వీక్షకుల సంఖ్యతో పాటుగా వీక్షణ సమయంను నమోదు చేసింది. ఈ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు రియాల్టీ షో ఇది. డిస్నీ+హాట్‌స్టార్‌ వీక్షకులు బిగ్‌బాస్‌ షో పట్ల విపరీతమైన అభిమానం చూపడంతో పాటుగా తొలి రోజు నుంచే అత్యధిక వీక్షణ సమయాలనూ నమోదుచేశారు.

డిస్నీ+హాట్‌స్టార్‌ కంటెంట్‌ హెడ్‌ మరియు డిస్నీ స్టార్‌ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌ హెచ్‌ఎస్‌ఎం గౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘‘ బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ రియాల్టీ షో కు వచ్చిన స్పందన పట్ల మేము పూర్తి సంతోషంగా ఉన్నాము. ఈ షోను డిస్నీ+హాట్‌స్టార్‌పై స్ట్రీమింగ్‌ చేయడం ఆరంభించిన మరుక్షణమే వీక్షించడానికి రికార్డు సంఖ్యలో ప్రేక్షకులు సిద్ధమయ్యారు. ఈ షో పట్ల వీక్షకుల ఆసక్తి మరియు ప్రతిస్పందన కు ఇది అద్దం పడుతుంది’ అని అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ ఎల్లప్పుడూ అండగా ఉండే మా ప్రేక్షకులకు నేను ధన్యవాదములు చెబుతున్నాను. ప్రతిసారీ బిగ్‌బాస్‌ షో విభిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వద్ద బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌కు రికార్డులను సృష్టిస్తూ ఓపెనింగ్‌లూ వచ్చాయి. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌తో నాన్‌స్టాప్‌గా వినోదం అందుతుంది’ అని అన్నారు.

“బిగ్ బాస్” నాన్ స్టాప్ “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3h9CHBT

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on February 28, 2022 8:08 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

30 seconds ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

26 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

36 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

57 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

1 hour ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago