కరోనాతో డల్ అయిపోయిన సినీ పరిశ్రమకి అఖండతో పండుగ కళ తెచ్చాడు బోయపాటి. బాలయ్య కెరీర్‌లోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించిందీ సినిమా. ఆ జోష్‌లో ఏమాత్రం గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమాని ప్రకటించేశాడు బోయపాటి.
రామ్ పోతినేనితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు బోయపాటి. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రామ్‌తో ‘ద వారియర్’ మూవీని తీస్తున్నారు. ఆ సినిమాని రెండు భాషల్లో తీస్తుంటే.. బోయపాటి సినిమాని మాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నట్లు శ్రీనివాస చెప్పారు. ఎప్పటి నుంచో బోయపాటితో సినిమా చేయాలని ఉందని, ఇప్పటికి కుదిరిందని, అది కూడా రామ్‌తో కావడం యమా హ్యాపీగా ఉందని అన్నారాయన.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ హీరోగా సత్తా చాటుతున్నాడు రామ్. తన ఫిజిక్, స్టైల్, బాడీ లాంగ్వేజ్‌తో పాటు స్టోరీ సెలెక్షన్‌ని కూడా పూర్తిగా మార్చేశాడు. ఈ క్రమంలో బోయపాటితో మూవీ సెట్ చేశాడంటే అది ఏ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయ్యుంటుందో ఊహించవచ్చు.
అయితే బోయపాటికి బాలయ్యతో కలిసొచ్చినట్టుగా ఇతర హీరోలతో కలిసి రాదు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. సింహా, లెజెండ్, అఖండలు విజయం సాధించినట్టుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి హీరోలతో తీసిన సినిమాలు సక్సెస్ కాకపోవడమే అందుకు కారణం. మరి రామ్‌తోనైనా హిట్టు కొట్టి ఆ నెగిటివ్ ఇమేజ్‌ని తుడిచేసుకుంటాడేమో చూడాలి.
This post was last modified on February 19, 2022 8:09 am
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…