ఇప్పుడు బాలీవుడ్ దృష్టంతా ‘గంగూబాయి: కతియావాడీ’ సినిమా మీదే ఉంది. కొవిడ్ మూడో వేవ్ కారణంగా రెండు నెలలుగా హిందీలో చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేదు. డిసెంబరు నెలాఖరులో రావాల్సిన ‘జెర్సీ’ నుంచి పేరున్న సినిమాలన్నీ వాయిదా పడిపోవడంతో రెండు నెలలుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ గ్యాప్ తర్వాత వస్తున్న పేరున్న చిత్రం ‘గంగూబాయి’నే. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన చిత్రమిది.
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. పెద్ద స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఐతే విడుదల ముంగిట ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ‘గంగూబాయి’ చిత్రాన్ని ఎవరి జీవిత కథతో తీశారో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సినిమా పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.గంగూబాయి దత్తపుత్రుడైన బాబు రావుజీ షా, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే ‘గంగూబాయి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసు వేశారు.
సినిమా విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్ట్ నిరాకరించినప్పటికీ.. కేసు మాత్రం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు రావుజీ ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అతను మాట్లాడుతూ.. ‘‘సినిమా కోసమని నా తల్లిని వేశ్యగా మార్చారు. అసలు మా అమ్మ వేశ్యనా.. సామాజిక కార్యకర్తనా అని ఇప్పుడు అనేకమంది అవమానిస్తున్నారు. ఈ మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. అమ్మ గురించి అందరూ ఇలా మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం’’ అన్నాడు. మరోవైపు గంగూబాయి మనవరాలు భారతి మాట్లాడుతూ.. గంగూబాయి గురించి పుస్తకం రాసేటపుడు కానీ.. ఆమెపై సినిమా తీసేటపుడు కానీ తమ అనుమతి తీసుకోలేదని.. డబ్బు కోసం వాళ్లు దిగజారి ప్రవర్తిస్తున్నామని.. ‘గంగూబాయి’ సినిమాను తామెవ్వరం అంగీకరించబోమని.. తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించింది.
గంగూబాయి సినిమా మొదలైనప్పటి నుంచి ఆమె కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక ఇళ్లు మారారని.. వాళ్లంతా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తోందని వారి తరఫు లాయర్ చెప్పారు. ఐతే ఈ విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా బన్సాలీ అండ్ టీం సినిమా విడుదల పనుల్లో నిమగ్నమైంది. బన్సాలీ సినిమాలకు ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. ‘పద్మావతి’ విషయంలో జరిగిన రచ్చ ఇంతకంటే చాలా ఎక్కువే.
This post was last modified on February 17, 2022 9:11 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…