విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ముగ్గురు బెస్ట్ యాక్టర్స్ కాంబినేషన్‌లో సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉంటుందా. అందుకే అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని స్పెషల్‌గా తీర్చిదిద్దుతున్నాడు విఘ్నేష్ శివన్. తన లవర్ నయన్ పాత్రతో పాటు సేతుపతి, సమంతల క్యారెక్టర్స్‌ని కూడా అదిరిపోయేలా డిజైన్ చేశానని ముందే చెప్పాడు. అది నిజమేనని కాసేపటి క్రితం రిలీజైన టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఇదో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. తనని సమానంగా ప్రేమించే ఇద్దరమ్మాయిల మధ్య చిక్కి సతమతమయ్యే లవర్‌గా సేతుపతి కనిపిస్తున్నాడు. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తెలీక.. ఏం మాట్లాడితే ఎవరు నెగిటివ్‌గా రియాక్టవుతారో అర్థం కాక ముప్పుతిప్పలు పడుతున్నాడు. ఆ కన్‌ఫ్యూజన్‌ని అద్భుతంగా పలికిస్తూ కడుపుబ్బ నవ్విస్తున్నాడు.
సీరియస్ రోల్స్‌తో మనసుల్ని మెలిపెట్టే సేతుపతి.. అందుకు భిన్నంగా ఈసారి ఫుల్ ఫన్‌తో ఎంటర్‌టైన్ చేస్తాడని అర్థమవుతోంది. నయనతార, సమంతలిద్దరూ గ్లామర్‌తో పాటు నటనలోనూ పోటీ పడ్డారని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్ 28న ముగ్గురి ఫ్యాన్స్‌కీ థియేటర్స్లో పండగే. ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకీ రానుంది.
This post was last modified on February 11, 2022 11:24 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…