Movie News

హాట్ టాపిక్: చిరు వెంట ఎవరు?

టాలీవుడ్‌ను దాదాపు పది నెలలుగా వేధిస్తున్న సమస్యకు ఎంతకీ పరిష్కారం దొరకట్లేదు. గత ఏడాది వేసవిలో పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కారు టికెట్ల రేట్ల మీద నియంత్రణ తేవడంతో మొదలైన ఈ సమస్య ఆ తర్వాత రకరకాల పరిణామాలతో మరింత జఠిలంగా మారింది. ఇండస్ట్రీ మొత్తం ఈ ఉచ్చులో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. టికెట్ల రేట్ల సవరణ విషయమై ఇదిగో అదిగో అంటూనే నెలలు నెలలు గడిచిపోయాయి. లాజిక్‌తో ఆలోచిస్తే చాలా సింపుల్‌గా పరిష్కారం అయిపోయే విషయాన్ని ప్రభుత్వం కావాలనే సాగదీస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీ మొత్తం తమకు సాగిలపడేలా చేసుకోవడానికే జగన్ సర్కార్ ఇలా చేస్తోందనే విమర్శలూ తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం జగన్‌తో చిరు నేతృత్వంలో సినీ ప్రముఖుల సమావేశం కీలకంగా మారింది. గత నెలలో చిరంజీవి ఒక్కడే తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలవడం తెలిసిందే. ఐతే ఈసారి చిరుతో పాటు పరిశ్రమలో కీలకంగా ఉన్న స్టార్ హీరోలను కూడా వెంటబెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ సన్నిహిత వర్గాల నుంచి ఇవే సంకేతాలు అందాయట. టాలీవుడ్ ప్రముఖ హీరోలందరినీ వెంటబెట్టుకుని కలిసి సీఎంను ప్రసన్నం చేసుకుంటేనే టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు వస్తుందనే గుసగుసలు నడుస్తున్నాయి టాలీవుడ్లో.

ఈ నేపథ్యంలో చిరు టాప్ స్టార్లు ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నారని.. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్.. ఇలా చాలామందికి ఫోన్లు చేస్తున్నారని అంటున్నారు. ఐతే ఇప్పుడు చిరు విన్నపాన్ని మన్నించి ఆయన వెంట వెళ్లి ఏపీ సీఎంను కలిసేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరం కాబట్టి వెళ్లడానికి ఇబ్బంది లేకున్నా.. సీఎంను కలిసే విషయంలో వాళ్లిద్దరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఈ బృందంతో వెళ్లాడంటే అతడి భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశమే లేదన్నది స్పష్టం. బన్నీ కూడా వెళ్లడం అనుమానమే. మరి గురువారం చిరు వెంట నడిచేదెవరో చూడాలి.

This post was last modified on February 9, 2022 2:16 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

32 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

42 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago