కింగ్ నాగార్జున తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల భార్య సమంతకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ అనూహ్యంగా తాము విడిపోబోతున్నామని ప్రకటించి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇక సామ్‌కి దూరమయ్యాక ఒంటరిగానే ఉంటున్న చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేశాడు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ సిరీస్‌కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తనయుడు చైతు బాటలోనే నాగార్జున కూడా వెళ్లబోతున్నారట. ఈ మధ్యే `బంగార్రాజు`తో ప్రేక్షకులను పలకరించి సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న నాగ్.. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పారట.
కరోనా వైరస్ దెబ్బకు ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. దీంతో థియేటర్‌లకు గట్టి పోటీ ఇస్తున్న ఓటీటీలు.. ఎప్పటికప్పుడు స్పెషల్ కంటెంట్‌తో వస్తూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కోసం తెరకెక్కబోయే ఓ వెబ్ సిరీస్‌లో హీరోగా నటించేందుకు నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే త్వరలోనే ఆ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వస్తుంది.
This post was last modified on February 9, 2022 10:23 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…