ఈ ఏడాది వేసవిలో ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎన్నడూ చూడనంత సందడి చూడబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సమ్మర్‌కి భారీ చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, కేజీఎఫ్-2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు తోడు.. వివిధ భాషలకు సంబంధించి పెద్ద సినిమాలున్నాయి. ఐతే పై మూడు చిత్రాలపై ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి పోటీగా ఏ భాషలోనూ వేరే సినిమాలు రిలీజయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు.
అందులోనూ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2లతో అయితే ఏ సినిమా అయినా పోటీకి సాహసిస్తుందా అన్నది అనుమానంగానే కనిపించింది. కానీ ‘కేజీఎఫ్-2’కు పోటీగా ఓ తమిళ భారీ చిత్రాన్ని థియేటర్లలో దించడానికి రంగం సిద్ధమవుతోంది. దీంతో సమ్మర్లో ఒక మెగా క్లాష్ చూడబోతున్నట్లే కనిపిస్తోంది. ‘కేజీఎఫ్-2’కు పోటీగా రానున్న ఆ చిత్రమే.. బీస్ట్.‘కేజీఎఫ్-2’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలన్నది ఇప్పటి నిర్ణయం కాదు.
చాన్నాళ్ల ముందే ఈ డేట్ ప్రకటించారు. ఐతే ఏప్రిల్ 14న తమిళులకు చాలా స్పెషల్ డేట్. అది తమిళులకు నూతన సంవత్సరాది. ప్రతి సంవత్సరం ఆ తేదీకి భారీ చిత్రాలు రిలీజవతుంటాయి. ఈసారికి విజయ్ ఈ డేట్‌ను కైవసం చేసుకున్నాడు. ‘డాక్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో విజయ్ లాంటి టాప్ హీరో సినిమా చేయడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
ఇందులో పూజా హెగ్డే కథానాయిక కావడం కూడా ప్రత్యేక ఆకర్షణ. తమిళంతో పాటు వేరే భాషల్లోనూ దీనికి క్రేజ్ ఉంది. ఇక ‘కేజీఎఫ్-2’ మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి టైంలో ఓకే కానీ.. ఇలా రెండు భారీ చిత్రాలు వేసవిలో ఒకే తేదీకి రిలీజవడం అరుదు. ఐతే ఈ డేట్‌ను రెండు చిత్రాలూ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి సమ్మర్లో మెగా క్లాష్ చూడబోతున్నట్లే.
This post was last modified on February 7, 2022 8:12 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…