ఆ ముగ్గురు న‌టులు.. చివ‌రి సినిమాల్లో కోయిన్సిడెన్స్

irrfan Khan Sushant

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోవ‌డం అభిమానులకు, సినీ జ‌నాల‌కు చాలా క‌ష్టంగానే ఉంది. 34 ఏళ్ల వ‌య‌సులోనే కెరీర్లో మంచి స్థితిలో ఉండ‌గా అత‌నిలా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం పెద్ద షాకే.

ఎంత సంపాదించినా.. ఎంత ఫేమ్ తెచ్చుకున్నా.. మాన‌సిక సంతోషం లేకుంటే వృథా అన‌డానికి సుశాంత్ విషాదాంతం ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. సుశాంత్ మ‌ర‌ణం నేప‌థ్యంలో మ‌రో ఇద్దరు న‌టుల‌తో అత‌డికి చిత్రమైన కోయిన్సిడెన్స్ క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ వైర‌ల్ కూడా అవుతోంది.

చివ‌ర‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన సుశాంత్ సినిమా చిచ్చోరేలో ఒక సీన్లో అత‌ను కార్లో ప్ర‌యాణిస్తూ బ‌య‌టికి త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం చాలా హృద్యంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొన్ని నెల‌ల కింద‌టే క్యాన్స‌ర్‌తో చ‌నిపోయిన ఇర్ఫాన్ ఖాన్ సైతం త‌న చివ‌రి సినిమా అంగ్రేజీ మీడియంలో ఒక చోట కార్లోంచి బ‌య‌టికి త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే దృశ్యం ఉంటుంది.

వీళ్లిద్ద‌రే కాదు.. డార్క్ నైట్ సినిమాలో జోక‌ర్ పాత్ర‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన‌లేని పేరు సంపాదించిన హీత్ లెడ్జ‌ర్ సైతం ఆ సినిమాలో ఒక స‌న్నివేశంలో కారు బ‌య‌ట త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే స‌న్నివేశం ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ హీత్ లెడ్జ‌ర్ ఒక మందు డోస్ ఎక్కువ‌గా వేసుకోవ‌డం వ‌ల్ల 2008లో ప్రాణాలు కోల్పోయాడు. అతడి వ‌య‌సు 28 ఏళ్లే. సుశాంత్‌, ఇర్ఫాన్‌, హీత్ అర్ధంత‌రంగా చ‌నిపోవ‌డం.. వాళ్ల చివ‌రి సినిమాల్లో ఒకే త‌ర‌హా స‌న్నివేశాల్లో క‌నిపించ‌డంతో ఈ కోయిన్సిడెన్స్ గురించి ట్విట్ట‌ర్లో చ‌ర్చ జ‌రుగుతోంది.