‘డాక్టర్’ లాంటి సీరియస్ కాన్సెప్ట్‌తో వచ్చి మెప్పించాక కామెడీతో కడుపుబ్బ నవ్వించడానికి స్కెచ్ వేశాడు శివకార్తికేయన్. శిబి చక్రవర్తి డైరెక్షన్‌లో ‘డాన్’ అనే కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మూవీ పూర్తై కూడా చాలా కాలమైంది. అయితే విడుదలకు మాత్రం కరోనా అడ్డుపడింది.
సినిమా పూర్తై చాలా కాలమైనా ఓ పట్టాన రిలీజ్‌కి లైన్ క్లియరవ్వలేదు. ఇక ఓటీటీలోనే రిలీజవుతోందంటూ మొన్నటి వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ సినిమాకి నిర్మాత కూడా అయిన శివకార్తికేయన్ రిలీజ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. థియేటర్‌లోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు.
మార్చ్ 25న ‘డాన్’గా వచ్చి థియేటర్స్‌లో సందడి చేయబోతున్నానని తాజాగా కన్‌ఫర్మ్ చేశాడు శివ. తన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజవుతుంది. అలాగే ఇదీ రానుంది. కానీ అదే రోజు రవితేజ నటిస్తున్న ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ మూవీ రాబోతోంది. ఆ విషయాన్ని ప్రకటించి కూడా చాలా రోజులైంది. అయితే అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే అదే రోజు ఆర్ఆర్ఆర్ వస్తుండటం.
రాజమౌళి సినిమా అనగానే స్టార్ హీరోలందరూ ఆమధ్య తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మరోసారి జక్కన్న రిలీజ్ డేట్‌ని లాక్ చేశాడు. అంటే అదే రోజు రానున్న రవితేజ సినిమాతో పాటు ఏప్రిల్ 1న రానున్న ఆచార్య, సర్కారు వారి పాట కూడా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో డాన్ గారు ధైర్యం చేసి వస్తారా? లేక తమిళంలో వచ్చి తెలుగులో కాస్త టైమ్ తీసుకుంటారా? ఆర్‌ఆర్‌ఆర్ అక్కడ కూడా రిలీజవుతుంది కాబట్టి మొత్తానికే పోస్ట్‌పోన్ చేసుకుంటారా? వేచి చూడాలి.
This post was last modified on February 1, 2022 9:35 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…