కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా మొదలుపెట్టారు ధనుష్. షూటింగ్ మొదలైన రెండో రోజే హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని చిత్రవర్గాలు చెప్పాయి. ఇప్పుడు సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నట్లుగా సమాచారం.
ముందుగా ఈ సినిమాకి దినేష్ కృష్ణన్ అనే తమిళ సినిమాటోగ్రాఫర్ ను తీసుకున్నారు. ఆయన కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నేను ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నాను.. త్వరలోనే ఈ టీమ్ తో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే హ్యాష్ ట్యాగ్ కోవిడ్ అని ఇవ్వడంతో.. కరోనా వచ్చి ఆయన ఈ సినిమా నుంచి తప్పుకొని ఉంటారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. సినిమా మొదలైన కొన్నిరోజులకే కెమెరామెన్ తప్పుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రంగా రూపొందింస్తున్నారు. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుందట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!
This post was last modified on January 26, 2022 8:11 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…