దిల్ రాజు నిర్మాతగా కంటే కూడా డిస్ట్రిబ్యూటర్‌గా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఎదిగినప్పటికీ.. ఆయన డిస్ట్రిబ్యూషన్ వదిలి పెట్టలేదు. తెలుగులో రిలీజయ్యే పెద్ద సినిమాల్లో చాలా వరకు దిల్ రాజు ద్వారానే నైజాంలో రిలీజవుతుంటాయి. వైజాగ్‌లో కూడా ఆయనకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఐతే ఏపీలో టికెట్ల రేట్లు తగ్గడం వల్ల డిస్ట్రిబ్యూషన్ జూదంగా మారిపోయింది.
అందుకే వైజాగ్‌ను వదిలేసి పూర్తిగా నైజాం మీదే ఫోకస్ పెట్టారాయన. సినిమా పొటెన్షియాలిటీని గుర్తించి కాస్త ఎక్కువ రేటు పెట్టి కూడా హక్కులు సొంతం చేసుకోవడానికి ఆయన వెనుకాడరు. చాలాసార్లు ఆయన జడ్జిమెంట్ సరైన ఫలితాన్నే ఇస్తుంటుంది. గత నెలలో విడుదలైన రెండు భారీ చిత్రాలు అఖండ, పుష్పల మీద ఆయన పెట్టిన పెట్టుబడికి చాలామంది ఆశ్చర్యపోయారు. బాలయ్య చివరి సినిమా ‘రూలర్’ ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేదు.
అలాంటిది నైజాం ఏరియా వరకే రూ.10 కోట్లకు ‘అఖండ’ హక్కులు కొన్నారు రాజు. అలాగే ‘పుష్ప’ మీద ఏకంగా రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ రెండు డీల్స్ రిస్క్ అనే అన్నారు చాలామంది. కానీ ‘అఖండ’ సినిమా మీద రాజు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఆదాయం రావడం విశేషం. ఊహించని విధంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇటీవలే హాట్ స్టార్‌లోకి రావడంతో ‘అఖండ’ బాక్సాఫీస్ రన్ ముగిసింది. ‘అఖండ’ నైజాం ఏరియలో రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టడం గమనార్హం.
బాలయ్యకు బేసిగ్గా నైజాంలో మార్కెట్ వీక్. అలాంటిది ఇక్కడ రూ.20 కోట్ల షేర్ రావడమంటే పెద్ద షాకే. మొత్తంగా ఆ చిత్రం రూ.70 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది. ఇక ‘పుష్ఫ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే నైజాంలో బ్రేక్ ఈవెన్ కష్టమే అనిపించింది. కానీ డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం నైజాంలో రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తొలి వారం తర్వాత ఈ చిత్రానికి పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మొత్తంగా అఖండ, పుష్ప సినిమాల ద్వారా దిల్ రాజు రూ.15 కోట్ల దాకా లాభం అందుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 25, 2022 4:34 pm
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…