ఒక కొత్త హీరో నటించిన సినిమా రిలీజవుతుంటే.. ఆ సినిమా ఎలా ఉందనే దాని కంటే ఆ హీరో ఎలా పెర్ఫామ్ చేశాడు అన్నదాని మీదే అందరి దృష్టి నిలిచి ఉంటుంది. హీరో బాగా చేశాడు అన్న కామెంట్లు వినిపిస్తే అది చాలనుకుంటారు. ఇక సినిమా కూడా బాగుంటే అది బోనస్. ఈ సంక్రాంతికి రిలీజైన రెండు చిత్రాలతో ఇద్దరు యువ కథానాయకులు టాలీవుడ్లోకి అడుగు పెట్టారు.
వాళ్లే.. ఆశిష్ రెడ్డి, గల్లా అశోక్. వీళ్లిద్దరి బ్యాగ్రౌండ్ చాలా బలమైందే. ఆశిష్ రెడ్డి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకన్న సంగతి తెలిసిందే. ఇక అశోక్ గల్లా ఏమో.. సూపర్ స్టార్ కృష్ణకు మనవడు, మహేష్ బాబుకు మేనల్లుడు. ఆశిష్ సినిమా ‘రౌడీ బాయ్స్’, ‘అశోక్ మూవీ ‘హీరో’ చాన్నాళ్ల ముందే విడుదలకు సిద్ధమైనప్పటికీ.. సరైన రిలీజ్ టైమింగ్ కోసం ఎదురు చూసి సంక్రాంతికి ఖాళీ దొరకడంతో థియేటర్లలోకి దిగాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ సరైన టాక్ రాలేదు. ఉన్నంతలో ‘రౌడీ బాయ్స్’ టాక్ పర్వాలేదు.
‘రౌడీ బాయ్స్’లో యూత్ ఫుల్ అంశాలున్నాయి. హీరో హీరోయిన్ల రొమాన్స్ ఓ మోస్తరుగా యువ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కానీ సినిమాలో ఓవరాల్‌గా చూస్తే ఏమంత విషయం లేదనే చెప్పాలి. సెకండాఫ్ పూర్తిగా తేలిపోవడం మైనస్ అయింది. కానీ ఈ చిత్రంతో ఆశిష్‌కు రావాల్సిన అప్లాజ్ అయితే వచ్చేసింది. లుక్స్ పరంగా జస్ట్ యావరేజ్ అనిపించినా.. నటనలో అతడి ఈజ్.. డ్యాన్సులు, ఫైట్లలో చురుకుదనం బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా డ్యాన్సుల్లో స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రీతిలో అదరగొట్టాడు. సినిమాకు బడ్జెట్ రికవర్ అయ్యే పరిస్థితి కనిపించకపోయినా.. హీరోకు మంచి పేరు రావడంతో దిల్ రాజు ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది.
ఇప్పుడొచ్చిన పేరుతో రెండో సినిమాతో సక్సెస్ కొట్టడం కీలకం. ఇక గల్లా అశోక్ విషయానికి వస్తే లుక్స్ పరంగా అతను కూడా ముందు అంతగా ఆకర్షించలేకపోయాడు. సినిమాలో అతడి పెర్ఫామెన్స్ మాత్రం ఆకట్టుకుంది. ఎక్కడా కొత్త హీరో అన్న బెరుకు, భయం కనిపించలేదు. చాలా ఈజ్‌తో తన పాత్రను లాగించేశాడు. డ్యాన్సులు, ఫైట్లలో ఆకట్టుకున్నాడు. కానీ సినిమా మరీ వీక్ అయిపోవడంతో అశోక్ కష్టం వృథా అయింది. ఐతే సరైన సినిమా పడితే అశోక్ కూడా రైజ్ అవ్వడానికి ఛాన్సుంది.
This post was last modified on January 19, 2022 9:31 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…