ఒకప్పుడు ఎన్నో హిట్టు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కృష్ణవంశీ.. ఇప్పుడు ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన తీసిన సినిమా ఏదీ కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో హీరోలు అతడితో కలిసి పని చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అలాంటి సమయంలో మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు కృష్ణవంశీ. ఆల్రెడీ హిట్ కథ కావడంతో తెలుగులో కూడా సినిమాకి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు.
అయితే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కృష్ణవంశీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్ర కోసం ఇక్కడ ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అలానే నానా పటేకర్ స్నేహితుడి పాత్ర కథకు చాలా కీలకం. మరాఠీలో ఆ పాత్రను విక్రమ్ గోఖలే పోషించారు. ఆయన పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే నానా పటేకర్ ను డామినేట్ చేశారనే చెప్పాలి.
అలాంటి పాత్ర కోసం తెలుగులో బ్రహ్మానందాన్ని తీసుకొని షాకిచ్చారు కృష్ణవంశీ. నిజానికి అది చాలా సీరియస్ గా ఎమోషనల్ గా సాగే పాత్ర. కొంచెం కూడా కామెడీ ఉండదు. పైగా ఆ పాత్రకు యాంటీ క్లైమాక్స్ ఇచ్చారు దర్శకుడు. అలాంటి పాత్రలో బ్రహ్మీను తీసుకోవడం సాహసమనే చెప్పాలి. పైగా ఈ సినిమాలో తొలిసారి గడ్డంతో కనిపించబోతున్నారు బ్రహ్మానందం.
నిజానికి ఈ పాత్రలో నటించడానికి ఓ సీనియర్ నటుడు ఆసక్తి చూపించారట. కృష్ణవంశీకి ఫోన్ చేసి మరీ అడిగారట. రెమ్యునరేషన్ కూడా వద్దని చెప్పారట. అయినప్పటికీ కృష్ణవంశీ మాత్రం బ్రహ్మానందాన్ని తప్ప ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనని చెప్పేశారట. ఇక రీసెంట్ గా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక సీన్ లో బ్రహ్మానందం నటన చూసి కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారట. ఆ సీన్ పూర్తయిన వెంటనే బ్రహ్మానందాన్ని కౌగిలించుకొని తన ప్రేమను కురిపించారట.
This post was last modified on January 17, 2022 8:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…