మలయాళ సినిమా సత్తా చాటుతోంది. డిఫరెంట్ కాన్సెప్టులు, వరుస హిట్లతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటోంది. అయ్యప్పనుమ్ కోశియుమ్, హెలెన్ లాంటి ఎన్నో మలయాళ సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నాయంటే కారణం వెర్సటాలిటీనే. ఇప్పుడు మరో మాలీవుడ్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌కి రెడీ అయ్యింది. అదే ‘డ్రైవింగ్ లైసెన్స్’.
పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమ్మూడు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు లాల్ కొడుకు జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహించాడు. ఓ సినిమా హీరోకీ, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌కి మధ్య వచ్చి ఇగో క్లాషెస్ చుట్టూ తిరిగే కథ ఇది. కేవలం నాలుగు కోట్ల రూపాయలతో తీస్తే ముప్ఫై కోట్లు వసూలు చేసి విజయ ఢంకా మోగించింది.
ఈ సినిమాని ‘సెల్ఫీ’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ అనౌన్స్ చేశాడు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్స్ చేస్తున్నారు. గుడ్ న్యూస్, జుగ్ జుగ్ జియో చిత్రాల ఫేమ్ రాజ్ మెహ్‌తా డైరెక్ట్ చేస్తున్నాడు. పృథ్విరాజ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
నిజానికి ఈ మూవీ మొదట తెలుగులోనే రీమేక్ కావాల్సి ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ రీమేక్ రైట్స్ తీసుకుని చాలా కాలమే అయ్యింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి తనే నటించబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత చరణ్ తప్పుకున్నాడని, ఆ స్థానంలో రవితేజ నటించనున్నాడనే గుసగుసలూ వినిపించాయి. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రకటనా రాలేదు. ఇంతలో బీటౌన్ వాళ్లు ఒకడుగు ముందుకేశారు. మరి టాలీవుడ్‌కి ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2022 8:06 pm
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన…
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…