ఎవరేం అన్నా సరే.. ఎంత మాట అన్నా సరే.. పడదాం. బయటకు వచ్చి మాట్లాడి పలుచన కావటం ఎందుకు? ఎవరినో ఎవరో అన్నారు.. మనల్ని కాదు కదా? అన్నట్లుగా వ్యవహరించే వారందరి బూజు వదిలేలా.. అప్పటివరకు పట్టిన భయం మత్తు వీడిపోయేలా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ‘సినిమా వాళ్లకు బలిసింది’ మాటలకు టాలీవుడ్ ప్రముఖులు నోరు విప్పుతున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత కమ్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఘాటుగా రియాక్టు అయ్యారు. సినిమా వాళ్లను అంత మాట అనేస్తారా? అని ప్రశ్నించటమే కాదు.. దమ్ముంటే.. ఎవరికి బలిసిందో తెలియాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఓపెన్ డిబేట్ కు రావాలంటూ సవాలు విసిరారు.
తాజాగా ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. “సినిమా వాళ్లంటే చీప్ గా దొరికారని బలిశారు అని మాట్లాడుతున్నారు. ఎవరు బలిశారు సర్? మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు? మీ చరిత్రలేంటి? వాటి గురించి మాట్లాడదామా? ఓపెన్ డిబేట్ కు వస్తారా ఎవరైనా? అని సూటిగా ప్రశ్నించారు. అక్కడితో ఆగని ఆయన.. ఎవరిని మెప్పించటానికి మీరు బలుపులు.. కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
“మీరంతా రాజకీయాల్లోకి రాక ముందు మీ ఆస్తులు ఎంత? వచ్చాక ఎంత? మీ పార్టీలోని చోటామోటా నాయకుల ఆస్తులు తీయండి. మా సినిమా వాళ్ల ఆస్తులు తీద్దాం రండి. ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా? దమ్ముంటే రండి. ఓపెన్ ఛాలెంజ్” అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన ‘సినిమా వాళ్లకు బలిసింది’ అన్న మాటకు రెండు రోజులు ఆలస్యంగా స్పందించిన తమ్మారెడ్డి.. అందుకు తగ్గట్లే రియాక్టు అయ్యారని చెప్పాలి.
తాము కష్టపడి సంపాదిస్తున్నామని.. సినిమాను తయారు చేస్తున్నామని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. తమ కళలను అమ్ముకుంటున్నామని.. ఒక సినిమాకు 200 మందికి పైనే కష్టపడతారన్నారు. తాము కోట్లకు కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నామన్నారు. “అంతేకానీ మీలా ఒక రూపాయి పెట్టి మొత్తం అంతా దోచుకుతినట్లేదు. మమ్మల్ని బలుపు అనడానికి అసలు మీరెవరు? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి. పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సవినయంగా మనవి చేస్తున్నా” అంటూ తన లోపలి ఫైర్ ను తమ్మారెడ్డి తొలిసారి బయటపెట్టారు.
This post was last modified on January 12, 2022 5:49 pm
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…