చిరంజీవి సినిమా అంటేనే ప్రేక్షకులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ఆయనతో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడంటే ఎలా ఉంటుంది! ‘గాడ్‌ఫాదర్’లో చిరుకి చెల్లెలిగా నయనతార నటిస్తోందనే వార్త ఎంత కిక్ ఇచ్చిందో.. అంతకు నాలుగైదు రెట్లు జోష్‌నిచ్చింది ఈ వార్త. ఈ ఇద్దరినీ కలిసి వెండితెర మీద చూసేందుకు ఎదురు చూడటం అప్పుడే మొదలుపెట్టేశారు మెగా ఫ్యాన్స్.
ఈ చిత్రానికి మాతృక అయిన మలయాళీ సూపర్ హిట్ ‘లూసిఫర్’లో హీరోకి ఓ నమ్మకమైన అనుచరుడు ఉంటాడు. హీరోకి ఏ కష్టం వచ్చినా క్షణాల్లో వచ్చి వాలిపోతాడు. తన ప్రాణాలను అడ్డేసి మరీ హీరోని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంటాడు. అందులో ఆ క్యారెక్టర్‌ని పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. తెలుగులో సల్లూ భాయ్ చేస్తున్నాడు.
త్వరలో సల్మాన్ షూట్‌లో కూడా జాయినవబోతున్నాడట. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. జనవరి చివర్లో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు సల్మాన్ కూడా పాల్గొంటాడట. ప్రస్తుతం పరిస్థితులు బాలేదు కాబట్టి.. సిట్యుయేషన్స్ ఎలా మారతాయో చూశాకే వర్క్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి సల్మాన్ పాత్ర నిడివి తక్కువే. కొన్ని సీన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఒరిజినల్ స్క్రిప్ట్‌లో లేని చాలా విశేషాలు తెలుగులో ఉండబోతున్నాయి. వాటిలో భాగంగా చిరు, సల్మాన్‌లపై ఓ పాటను ప్లాన్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ పాటను వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌తో పాడించాలనుకుంటున్నారు. సల్మాన్‌కి సంబంధించిన షూట్‌కి ఐదు నుంచి వారం రోజులు సరిపోతుందట. అందుకే ఓసారి సల్మాన్ వస్తే ఇక గ్యాప్ ఇవ్వకుండా తన పోర్షన్‌ని కంప్లీట్ చేసేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 11, 2022 8:56 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…