టాలీవుడ్లో వారసుల జోరు మామూలుగా లేదిప్పుడు. కాస్త పేరున్న హీరోల దగ్గర్నుంచి లిస్టు తీస్తే మెజారిటీ వాళ్లే కనిపిస్తారు. పర్సంటేజ్ తీస్తే 70-80 శాతం వాళ్లదే ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్లోకి కొత్తగా ఇంకో ఇద్దరు వారసులు వస్తున్నారు. వాళ్లే గల్లా అశోక్, అశిష్ రెడ్డి. అశోక్ సూపర్ స్టార్ కృష్ణకు మనవడు, మహేష్ బాబుకు మేనల్లుడు. అశిష్ రెడ్డి దిల్ రాజు సోదరుడి కొడుకు. వీళ్లిద్దరి సినిమాలు హీరో, రౌడీ బాయ్స్ సంక్రాంతి కానుకలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ ఇద్దరిలో అశోక్‌కు బ్యాగ్రౌండే కొంచెం బలమైంది. మహేష్ మేనల్లుడంటే ఆటోమేటిగ్గా కొంత క్యూరియాసిటీ ఉంటుంది. దీనికి తోడు భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య హీరో మూవీకి దర్శకుడు కావడం, దీని ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది.
గల్లా అశోక్ లాంచింగ్ కోసం చాలా ఏళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. అతను హీరో కావడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం, అది మహేష్ మూవీకే కావడం విశేషం. మహేష్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన శ్రీమంతుడు మూవీకి అశోక్.. కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. హీరో కావాలన్నా సరే.. సినిమా గురించి పూర్తిగా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో మహేష్ రెకమండేషన్‌తో ఆయన సినిమాకే ఏడీగా పని చేశాడు అశోక్.
ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో అశోక్ తెరంగేట్రానికి ఏర్పాట్లు జరిగాయి. ఐతే ఆ సబ్జెక్ట్ నచ్చక సినిమా పక్కకు వెళ్లిపోయింది. తర్వాత హీరో లైన్లోకి వచ్చింది. హీరోగా అరంగేట్ర చిత్రానికి హీరో అనే టైటిలే పెట్టుకోవడం.. సినిమా హీరో కావాలన్న కుర్రాడి పాత్రనే ఇందులో అశోక్ పోషించడం విశేషమే. మరి తొలి చిత్రంతో అశోక్ ఎలాంటి ముద్ర వేస్తాడు.. మున్ముందు ఎలా ఎదుగుతాడు అన్నది చూడాలి.
This post was last modified on January 10, 2022 9:29 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…