అదే పనిగా ఏ విషయాన్ని టచ్ చేయని ఆర్జీవి.. ఒకసారి టచ్ చేశాక మాత్రం.. ఎదుటోడికి కాలిపోయేలా చేసే వరకు ఆగడు. అంతేనా.. తాను చెప్పే మాటలకు తగ్గట్లే బలమైన వాదనను తెర మీదకు తీసుకొస్తాడు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల మీద తీసుకుంటున్న నిర్ణయాలు.. దానికి చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన స్పందనలకు.. వాటికి కౌంటర్లు వేసిన ఏపీ మంత్రులు ఇప్పుడు గొంతులుసవరించుకోవాల్సిన పరిస్థితి. ఆవేశంతో పవన్ కల్యాణ్.. ఆవేదనతో నాని.. ఆగ్రహావేశాలతో సిద్దార్థ్ లాంటోళ్లు సినిమా టికెట్ల ధరల మీద స్పందిస్తే వారికి పడిన పంచ్ ల గురించి తెలిసిందే.
ఇంతకాలం వైఎస్ జగన్ క్యాంప్ మనిషిగా ముద్ర పడిన ఆర్జీవీ.. అందుకు భిన్నంగా తేడా వస్తే.. ‘‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే’’ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఆయన సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు కొత్త మంటను రగిలేలా చేస్తున్నాయి. మిగిలిన వారి మాదిరి.. నాలుగు పంచ్ డైలాగులు చెప్పేస్తే.. విని ఊరుకోవటానికి అక్కడున్నది వర్మ అన్నది మర్చిపోకూడదు.
ఏదైనా విషయానికి సంబంధించి ఒకసారి డిసైడ్ కానంతవరకు ఓకే కానీ.. ఒకసారి డిసైడ్ అయ్యాక తన మాట తానే వినని తీరు వర్మలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. వర్మను పిన్ను తీసిన ల్యాండ్ మైన్ లాంటోడు. దాని మీద కాలు పెట్టనంతవరకు ఓకే. ఒకసారి పెడితే.. దాని మీద ఉన్నది ఎవరి కాలు అన్నది పట్టించుకోకుండా ల్యాండ్ మైన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. వర్మ కూడా సేమ్ టు సేమ్ అని చెప్పాలి.
ఇప్పటివరకు వర్మ మాట్లాడిన అంశాలు.. భుజాన వేసుకున్న ఇష్యూలకు భిన్నంగా ఆయన తీరు ఉంది. ఎప్పుడూ కూడా తన మాదిరి మాట్లాడాలని కానీ.. తాను చెప్పినట్లే.. మిగిలిన వారు కూడా రియాక్టు కావాలన్న మాట ఆర్జీవీ నోట వినిపించదు. నాకు నచ్చింది నేను చెబుతా. వింటే వినండి.. లేకుంటే ఊరుకోండన్నట్లుగా వ్యవహరించే వర్మ.. అందుకు భిన్నంగా సినిమా టికెట్ల ధరల తగ్గింపు చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా మాట్లాడాలని.. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ నోళ్లు తెరవలేరని అభిప్రాయపడటం చూస్తే.. ఆయన తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
మిగిలిన వారి మాదిరి సమస్యను పైపైన టచ్ చేయటం కాకుండా.. ఒక విశ్లేషణ రూపంలో.. ఐదారు అంశాల్ని ఉదాహరణలు చెప్పటం.. తన వాదనలకు కౌంటర్ వేసే ముందు.. కాస్త ఆలోచించి వేయాలన్న హెచ్చరిక ఆయన చేసే పోలికల్లో కచ్ఛితంగా కనిపిస్తుంది.
సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై మాట్లాడే వేళ.. రాంగోపాల్ వర్మ ప్రముఖ ఆర్థిక వేత్త ఆడమ్ స్మిత్ చెప్పిన ఆర్థిక సూత్రాల్ని సైతం ప్రస్తావించి.. వాటితో ప్రభుత్వ నిర్ణయాన్ని పోల్చి చూడటం చూసినప్పుడు.. ఇష్యూ మూలాల్లోకి వెళ్లిన వర్మను.. ఇప్పుడెలా ఎదుర్కొంటారన్నది పెద్ద ప్రశ్న. కిరాణా వ్యాపారం బెటర్ అన్నంతనే నాని మీద విరుచుకుపడిన ఏపీ అధికార పక్ష నేతలు.. అంతే సింఫుల్ గా వర్మ సంధించిన పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ఈజీ కాదు. ఒకవేళ.. ఆ ప్రయత్నం చేస్తే.. వరుస పెట్టి వీడియోలు వదలటమే కాదు.. తనకు కౌంటర్ ఇచ్చే ప్రముఖుడి ప్రతి మాటను విశ్లేషించి.. అందుకు తగ్గట్లు ప్రశ్నలు సంధించే సత్తా టన్నుల్లో ఉంటుంది. సినిమా టికెట్ల ఎపిసోడ్ లో వర్మ చేసిన వ్యాఖ్యలపై ఏపీ నేతలు ‘వాట్ టు డూ.. వాట్ నాట్ టు డూ’ అన్న ప్రశ్న వేసుకోకుండా రియాక్టు అయితే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 5, 2022 2:44 pm
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…