ప్రతి స్టార్ హీరో కూడా కెరీర్లో ఏదో ఒక టైంలో కచ్చితంగా చేయాలనుకునే పాత్ర పోలీస్. నిన్నటితరం సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. తర్వాతి తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పోలీస్ పాత్రలు చేశారు. వీరిలో చాలామంది ఆ పాత్రల్లో సూపర్ సక్సెస్ అయ్యారు కూడా. రవితేజ సైతం పోలీస్ పాత్రల్లో అదరగొట్టేశాడు. అల్లు అర్జున్ సైతం రేసుగుర్రంలో కాసేపు పోలీస్ పాత్రలో మెరిశాడు. స్టార్ హీరోలు ఈ క్యారెక్టర్ చేస్తే మాస్‌కు విందు భోజనం అన్నట్లే.
మంచి కథతో, పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో వస్తే ఆ సినిమాల రీచ్ చాలా ఎక్కువ. ఐతే టాలీవుడ్ టాప్ స్టార్లలో ప్రభాస్ ఒక్కడే ఇంకా ఖాకీ తొడగలేదు. ఐతే ఎట్టకేలకు ప్రభాస్‌ను పోలీస్‌గా చూసే అవకాశం అభిమానులకు దక్కబోతోంది. అతణ్ని ఖాకీ పాత్రలో చూపించబోయేది అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కావడం విశేషం. ప్రభాస్-సందీప్ కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమాను కొన్ని నెలల కిందటే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం ఉంది. ఐతే ఈలోపే ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చాడు ఈ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సందీప్ గొప్ప కథతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడని.. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్ర చేయబోతున్నాడని, అతను ఖాకీ తొడగనున్న తొలి సినిమా ఇదే అని చెప్పాడు.
ప్రభాస్ రేంజికి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని కూడా అన్నాడు. చివరగా ప్రభాస్ నుంచి వచ్చిన సాహో అంచనాలను తన స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అయినా సరే హిందీ మార్కెట్లో ఆ సినిమా హిట్‌గా నిలిచిందని చెప్పాడు భూషణ్. ప్రభాస్ పోలీస్ అన్న భూషణ్ మాటతో ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు. అందులోనూ టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్‌కు పెట్టింది పేరైన సందీప్.. ప్రభాస్ కోసం పోలీస్ పాత్రను ఎలా డిజైన్ చేసి ఉంటాడో అన్నది అమితాసక్తిని రేకెత్తించేదే.
This post was last modified on January 4, 2022 9:57 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…