Movie News

అర్జున ఫ‌ల్గుణ.. వాషౌట్..

థియేట‌ర్ల‌లోకి దిగే చిన్న సినిమాల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా మారుతోంది రోజు రోజుకూ. క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా అని జ‌నాలు మామూలుగానే థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేశారు. ఓటీటీలకు బాగా అల‌వాటు ప‌డిపోయారు. పెద్ద సినిమాలంటే ఉండే క్రేజ్ వేరు కాబ‌ట్టి వాటికి మంచి టాక్ వ‌స్తే వ‌సూళ్లు బాగుంటున్నాయి. యావ‌రేజ్ టాక్‌తోనూ అవి ఓ మోస్త‌రుగా న‌డుస్తాయి.

కానీ చిన్న సినిమాల ప‌రిస్థితి అలా కాదు. టాక్ బాగున్నా స‌రే.. థియేట‌ర్ల‌కు జ‌నాల‌ను ర‌ప్పించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. అందులోనూ తెలంగాణ‌లో టికెట్ల రేట్లు పెంచేయ‌డం చిన్న సినిమాల ఆక్యుపెన్సీ మీద మ‌రింత ప్ర‌భావం చూపిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. 2021 చివ‌రి సినిమాగా శుక్ర‌వారం నాడు శ్రీ విష్ణు సినిమా అర్జున ఫ‌ల్గుణ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మామూలుగానే ఈ సినిమాకు అంత‌గా బ‌జ్ లేదు. దీనికి తోడు పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో సినిమా వాషౌట్ అయిపోయింది.

పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు బాగా ఆడుతున్న టైంలో వ‌చ్చి, డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకోవ‌డంతో అర్జున ఫ‌ల్గుణ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వాషౌట్ అయిపోయింది. రిలీజ్ చేసిందే త‌క్కువ థియేట‌ర్ల‌లో. పైగా టాక్ బాగా లేదు. అందులోనూ తెలంగాణ‌లో టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. ఇక థియేట‌రుకొచ్చి ఈ సినిమాను చూసేదెవ‌రు? థియేట‌ర్ల మెయింటైనెన్స్ డ‌బ్బులు కూడా రాక షోలు త‌గ్గించేశారు. వీకెండ్ అయ్యేస‌రికే సినిమా అడ్ర‌స్ లేకుండా పోయే ప‌రిస్థితి త‌లెత్తింది.

క‌థ‌ల ఎంపిక‌లో మంచి అభిరుచి ఉన్న‌వాడిగా పేరున్న శ్రీవిష్ణు, ఇప్ప‌టిదాకా మంచి మంచి సినిమాలు నిర్మించిన మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నిరంజ‌న్ రెడ్డిల‌కు అర్జున ఫ‌ల్గుణ చాలా చెడ్డ పేరు తెచ్చింది. శ్రీ విష్ణు కెరీర్లో హిట్లున్నా స‌రే.. అత‌డికి స్టార్ ఇమేజ్ లేక‌పోవ‌డం, మాస్ ఫాలోయింగ్ లేక‌పోవ‌డంతో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అత‌డి సినిమాలు అస్స‌లు నిల‌బ‌డట్లేదు. ఇంత‌కుముందు తిప్ప‌రా మీసం లాగే అర్జున ఫ‌ల్గుణ‌ కూడా వాషౌట్ అయిపోయింది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌.

This post was last modified on January 3, 2022 9:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago