కింగ్ కాంగ్, గాడ్జిల్లా కొట్టేసుకుంటుంటే.. ఒక కుక్క వచ్చి వాటిని కర్రతో బాదుతున్నట్లు ఒక మీమ్ సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తుంటుంది. సందర్భాన్ని బట్టి ఈ మీమ్‌ను నెటిజన్లు బాగా వాడుతుంటారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాల విషయంలోనూ సందర్భం కుదిరి ఒక మీమ్ హల్‌చల్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ అనే భారీ చిత్రాలు ఒకదాంతో ఒకటి తలపడుతుంటే.. బంగార్రాజు వచ్చి వాటిని తరిమేసినట్లుగా ఉన్న మీమ్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది.
సంక్రాంతికి ప్రధానంగా పోరు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల మధ్యే ఉంటుందని అంతా అనుకుంటూ వచ్చారు. సంక్రాంతికి ‘బంగార్రాజు’ కూడా రేసులో ఉంటుందని ముందు నుంచి సంకేతాలు అందుతున్నప్పటికీ.. ఈ భారీ చిత్రాల మధ్య దానికి ఏమాత్రం థియేటర్లు దక్కుతాయో, దాన్ని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారో అన్న సందేహాలు చాలామందిలో కలిగాయి.
ఐతే ఇప్పుడు ఆ చిత్రమే సంక్రాంతికి లీడ్ రోల్ తీసుకునేలా కనిపిస్తోంది.దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో థియేటర్లపై ఆంక్షల దిశగా అడుగులు పడుతుండటంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలను వాయిదా వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటనలు రావడమే తరువాయి. ఇవి రెండూ రేసు నుంచి తప్పుకోవడంతో ‘బంగర్రాజు’కు ఎదురే లేనట్లు తయారైంది. ఈ సినిమా దాదాపుగా ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది.
సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ మూవీ అని నాగ్ ముందు నుంచి చాలా నమ్మకంతో ఉన్నాడు. పెద్ద సినిమాల మధ్య కూడా దీన్ని పట్టుబట్టి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు సింహాసనం వేసినట్లే అయింది. ‘భీమ్లా నాయక్’ కూడా సంక్రాంతికి వస్తుందని అంటున్నప్పటికీ.. అది గ్యారెంటీ అని చెప్పలేం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదా పడటం ఖాయమని తెలియగానే నాగ్ ఆలస్యం చేయకుండా ‘బంగార్రాజు’ టీజర్ కూడా లాంచ్ చేయించేశాడు. సంక్రాంతి రిలీజ్‌ను ఖరారు చేశాడు కూడా. చూస్తుంటే 2016 సంక్రాంతి టైంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మాదిరే ఈ పండక్కి ‘బంగార్రాజు’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందేమో అనిపిస్తోంది.
This post was last modified on January 1, 2022 4:07 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…