ఇక ఆ సినిమాలన్నీ లేనట్టే!

షూటింగ్ చేసుకోడానికి షరతులు లేని అనుమతి వస్తుందని భావించిన చిత్ర పరిశ్రమకు పెద్ద షాకే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలు మాత్రమే మొదలు పెట్టుకోవాలని నిబంధన పెట్టడంతో ఆరంభ దశలో ఉన్న చిన్న సినిమాలకు, ఇంకా మొదలు కానీ పెద్ద సినిమాలకు బ్రేక్ వేసినట్టయింది.

సర్కారు వారి పాట, పుష్ప లాంటి చిత్రాల షూటింగ్స్ ఇప్పట్లో మొదలు కావు. ఇక ఒక షెడ్యూల్ జరుపుకున్న చిన్న సినిమాలైతే ఇక ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఎప్పటికి పూర్తిగా ఆంక్షలు తొలగిస్తారనేది తెలియదు కనుక పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలను మాత్రం పూర్తి చేస్తున్నారు.

ఆగష్టు నాటికి అయినా థియేటర్లు తెరుచుకోకపోతే వీటిలో చాలా సినిమాలు ఓటిటీ లేదా పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న చిన్న సినిమాలను కాల్ ఆఫ్ చేసేసారు. అన్నీ బాగుంటే వచ్చే ఏడాది మొదలు పెడదామని తేల్చేసారు. సింగల్ షెడ్యూల్ లేదా ఇరవై, ముప్పై శాతం పూర్తయిన చిన్న సినిమాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అనుకుంటూ… ఖర్చయిన మొత్తం మీద ఆశలు వదిలేసుకుంటున్నారు.