చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతో నయం. నిరుడు రెండు మూడు నెలలకు మించి సినిమాల సందడి లేదు. కరోనా మహమ్మారి దెబ్బకు మిగతా కాలమంతా ఎన్నడూ చూడని విషాదాన్ని ఎదుర్కొంది ఫిలిం ఇండస్ట్రీ. ఈ ఏడాది కూడా మధ్యలో కరోనా ప్రభావంతో కొన్ని నెలలు స్తబ్దత నెలకొన్నా దానికి ముందు, తర్వాత సినిమాల సందడికి ఢోకా లేకపోయింది.
సెకండ్ వేవ్ తర్వాత పుంజుకోవడానికి సమయం పట్టి.. ఏడాది చివర్లో మాత్రం బాక్సాఫీస్‌కు మాంచి ఊపే వచ్చింది. డిసెంబరు ఆరంభంలో ‘అఖండ’ అదరగొడితే.. మధ్యలో ‘పుష్ప’ అందుకున్నాడు. గత వారం విడుదలైన ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా బాగానే ఆడుతోంది. ఇక సంవత్సరంలో చివరి రోజు కూడా ఒక సినిమా థియేటర్లలోకి దిగుతోంది.
ఆ చిత్రమే.. అర్జున ఫల్గుణ.వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యువ కథానాయకుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఇంతకుముందు ‘జోహార్’ అనే సినిమా తీసిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళమ్మాయి అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. డబ్బుతో ముడిపడ్డ ఒక క్రైమ్ చుట్టూ నడిచే కామెడీ డ్రామానే ఈ సినిమా. ప్రోమోలు చూస్తే యాక్షన్, ఎంటర్టైన్మెంట్ బాగానే మిక్స్ చేసినట్లుగా కనిపించింది.
ఇందులో శ్రీవిష్ణు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పాత్రలో కనిపించడం విశేషం. ప్రోమోలు చూస్తే మంచి విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది కానీ.. ముందు, వెనుక పెద్ద సినిమాల మధ్య పడటం.. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ రావడానికి వారం రోజుల ముందు థియేటర్లలోకి దిగడం దీనికి కొంత ప్రతికూలమే. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు కూడా ఈ సినిమాపై కొంత నెగెటివ్ ఇంపాక్ట్ చూపించేలాగే ఉంది. ఐతే సినిమాలో విషయం ఉండి, ఇయర్ ఎండ్ వీకెండ్ కలిసొస్తే సినిమా గట్టెక్కేయొచ్చు. మరి ఏడాదిలో చివరి సినిమా 2021 బాక్సాఫీస్‌కు ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి.
This post was last modified on December 31, 2021 2:36 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…