రాజశేఖర్ కి పర్ఫెక్ట్ సినిమా!

గరుడవేగ సినిమాతో సుడి తిరిగినట్టే తిరిగి మళ్ళీ కల్కి తో రివర్స్ అయింది. దాంతో రాజశేఖర్ మళ్ళీ కథల వేటలో పడ్డాడు. మలయాళంలో వచ్చిన ఒక చిన్న సినిమా జోసెఫ్ రీమేక్ చేస్తే బాగుటుందని రాజశేఖర్ కి అనిపించింది. రాజశేఖర్ ఏజ్ కి, ఆయన ఇమేజ్ కి ఈ పాత్ర బాగా సూట్ అవుతుంది.

రాజశేఖర్ తో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అది జోసెఫ్ రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. లాక్ డౌన్ టైంలో ట్రెండ్ అయిన మలయాళ సినిమాల్లో జోసెఫ్ కూడా ఒకటి.

ఇమేజ్ మేక్ ఓవర్ కోసం చూస్తున్న రాజశేఖర్ ఈ చిత్రంతో పెద్ద తరహా పాత్రల వైపు హీరోలా షిఫ్ట్ అయిపోవచ్చు. ఓటిటీ వేదికను వాడుకోవాలని చూస్తున్న గీత ఆర్ట్స్ 2 మేకర్స్ ఇప్పుడు పలు చిన్న సినిమాలను తెరకెక్కించే పనిలో బిజీ అయ్యారు. అందుకే కథాబలం ఉండి, స్టార్స్ అవసరం లేని సినిమాలపై దృష్టి పెట్టారు.