తమిళ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకడు. ఐతే తన స్టార్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది ఆయన తీరు. ఎక్కడా స్టార్‌ని అన్న గర్వం ఉండదు. ఊరికే హడావుడి చేయడు. మీడియాను కలవడు. ఇంటర్వ్యూలివ్వడు. అసలు అజిత్ స్టార్ అయ్యాక అతడి సినిమా దేనికీ ప్రి రిలీజ్ ఈవెంటే జరగలేదు. అజిత్ తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన వీడియో బైట్ కూడా ఏదీ కనిపించడు. తనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చూపించుకోవడం, తానో పెద్ద స్టార్‌ని అని బిల్డప్ ఇవ్వడం అస్సలు కనిపించవు అజిత్‌లో. అసలతను ఆఫ్ స్క్రీన్ కనిపించడమే అరుదు.
ఒక సినిమా చేశామా.. దాని రిలీజ్ సంగతి దర్శక నిర్మాతలకు వదిలేసి ఇంకో సినిమా పనిలో పడిపోయామా అన్నట్లుంటుంది అజిత్ తీరు. ఇక అతడి వ్యక్తిత్వం గురించి, సింప్లిసిటీ గురించి తనతో పని చేసిన వాళ్లు, కలిసిన వాళ్లు చాలా గొప్పగా చెబుతుంటారు. తాజాగా ఆ జాబితాలోకి మన దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేరాడు.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఒక తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూకు వెళ్లాడు రాజమౌళి.
అక్కడ అజిత్ కుమార్ ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా అతడితో తనకున్న మంచి అనుభవం గురించి రాజమౌళి గుర్తు చేసుకున్నాడు. ‘‘నేనొకసారి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కోసం ఉన్నపుడు అక్కడి సితార హోటల్లోని రెస్టారెంట్‌కు భోజనం కోసం వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే అజిత్ గారు ఒక టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ కనిపించారు. ఎవరో నేనొచ్చానని చెబితే.. అజిత్ గారు భోజనం మధ్యలోంచి లేచి నా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి నన్ను లోపలికి తీసుకెళ్లారు.
అంత పెద్ద స్టార్ అలా చేయడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అంతలో నా భార్య రమ్య కూడా వస్తోందని తెలిసి.. మళ్లీ ఆయన లేచి డోర్ దగ్గరికి వెళ్లి నేను అజిత్ అని పరిచయం చేసుకుని ఆమెను లోపలికి తీసుకొచ్చారు. ఆయన సింప్లిసిటీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక ఈ మధ్య అభిమానులనుద్దేశించి ఆయనొక స్టేట్మెంట్ ఇచ్చారు. కోట్లమంది తననుద్దేశించి ‘తల’ అంటుంటే.. అలాంటిదేమీ వద్దని, తాను కేవలం ‘అజిత్ కుమార్’ మాత్రమే అని, అలాగే పిలవాలని చెప్పడం గొప్ప విషయం. ఆయనకు హ్యాట్సాఫ్’’ అని రాజమౌళి కొనియాడాడు.
This post was last modified on December 31, 2021 9:09 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…