ఏది ఏమైనా సరే అనుకున్నట్లే ‘ఆర్ఆర్ఆర్’ను జనవరి 7న విడుదల చేయడానికి సిద్ధమైపోయింది చిత్ర బృందం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఢిల్లీలో థియేటర్లు మూసి వేయడం, మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తుండటంతో ఈ భారీ చిత్రానికి కచ్చితంగా కలెక్షన్ల పరంగా డెంట్ పడేలాగే కనిపిస్తోంది. ఆల్రెడీ హిందీ మూవీ ‘జెర్సీ’ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ను అలా సింపుల్‌గా వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆ చిత్రం మూడుసార్లు వాయిదా పడింది.
ఇప్పుడు పోటీలో ఉన్న వేరే చిత్రాలను చాలా కష్టపడి ఒప్పించి, తప్పించి జనవరి 7 విడుదలకు సిద్ధమైందీ సినిమా. దీని స్కేల్ దృష్ట్యా రిలీజ్ సన్నాహాలకు, ప్రమోషన్లకు కూడా చాలా కష్టపడ్డారు. ఇంతా చేసి విడుదల వాయిదా వేయడం అంటే చాలా కష్టమే. అందుకే నార్త్ ఇండియాలో కొంతమేర వసూళ్లలో కోత పడ్డా పర్వాలేదని ముందుకు వెళ్లిపోతున్నారు.
ఐతే లోలోన మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ టీంలో టెన్షన్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇంకో వారం తర్వాత కరోనా తీవ్రత పెరిగితే.. సినిమా రిలీజయ్యాక ఆంక్షలు ఎక్కువైతే.. నైట్ కర్ఫ్యూలతో ఎక్కువ చోట్ల సెకండ్ షోలు రద్దయితే.. 50 శాతం ఆక్యుపెన్సీ పెడితే.. మరిన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడితే.. అప్పుడు పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రం విడుదలవుతుంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది థియేటర్లకు వస్తారు. ప్రతి థియేటర్ దగ్గరా వందల మంది గుమికూడతారు. సోషల్ డిస్టన్స్‌కు ఛాన్సే ఉండదు. దీని వల్ల కరోనా కేసుల సంఖ్య కచ్చితంగా పెరగొచ్చు. దాని వల్ల కరోనా తీవ్రత పెరిగినట్లవుతుంది.
ఈ వేసవిలో ‘వకీల్ సాబ్’ లాంటి భారీ చిత్రం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు కూడా ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో టెన్షన్ ఉంటుంది. రిలీజ్ ఆపమని చెప్పలేరు కానీ.. సినిమా చూసే విషయంలో ప్రేక్షకులను డిస్కరేజ్ చేసేలా ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూలు, 50 పర్సంట్ ఆక్యుపెన్సీలు వస్తే ఆశ్చర్యమేమీ లేదు. మరి ఇలాంటి చర్యలతో వసూళ్లపై గట్టిగానే ప్రభావం పడే పరిస్థితి వస్తే ఎలా అన్న ఆందోళన ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ టీంను వెంటాడుతోంది.
This post was last modified on December 30, 2021 2:30 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…