తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది కియారా అద్వానీ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. వాటిలో రామ్ చరణ్, శంకర్‌ల సినిమా ఒకటి. చాలా గ్యాప్ తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇది.
అయితే ఈమధ్య సినిమాల కంటే మరో విషయానికి వార్తల్లో నిలుస్తోంది కియారా. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ప్రేమలో ఉంది. ఆ విషయాన్ని ఇంతవరకు కన్‌ఫర్మ్ చేయలేదు. కానీ ఇద్దరూ కలిసి చాలాసార్లు మీడియా కంటబడటంతో విషయం వైరల్ అయ్యింది. రీసెంట్‌గా సిద్ధార్థ్ ఇంటికెళ్లినప్పుడు కూడా కియారా కెమెరాల కంటికి చిక్కింది. అయితే అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల విపరీతంగా ట్రోలింగ్‌కి గురయ్యింది.
సిద్ధార్థ్ ఇంటి ముందు ఓ వృద్ధుడు వాచ్‌మేన్‌గా ఉన్నాడు. కియారా కారు రాగానే పరిగెత్తుకు వెళ్లి డోరు తెరిచాడు. ఆమెకి సెల్యూట్ చేశాడు. ఇది గమనించిన నెటిజన్స్ కియారాని కార్నర్ చేశారు. అంత పెద్దాయనతో సెల్యూట్ చేయించుకోవాలా అంటూ తనని తప్పుబట్టారు. ఆమెకి తలపొగరు ఎక్కువని, కాస్త కూడా మానవత్వం లేదని ట్రోల్ చేయసాగారు. అది కియారాకి కోపం తెప్పించింది. రీసెంట్ ఇంటర్వ్యూలో మండిపడింది.
‘ఆయన్ని సెల్యూట్ చేయమని నేను అడిగానా? సెక్యూరిటీ గార్డ్ కాబట్టి సహజంగానే ఆ పని చేసి ఉంటాడు. దానికి నన్ను ఆడిపోసుకోవడం దేనికి? కారులోంచి దిగుతుంటే ఫొటోలు, వీడియోలు తీసి వైరల్ చేశారు. ఇది కరెక్టా? నా స్థానంలో ఒక హీరో ఉంటే ఇలాగే ట్రోల్ చేస్తారా’ అంటూ ఆవేశంగా మాట్లాడింది. ఇలాంటివి మాట్లాడేముందు మీరెంత కరెక్టో చెక్ చేసుకోండి అంటూ క్లాస్ పీకింది. ఈ విషయంలో ఇంత మాట్లాడింది కానీ సిద్ధార్థ్‌తో తన ప్రేమ విషయంలో మాత్రం రియాక్టవకుండా తెలివిగా మాట దాటవేసింది కియారా.
This post was last modified on December 28, 2021 4:36 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…