పెద్దవాళ్లు ఓ విషయం చెబుతుంటారు. కింద పడినంత మాత్రాన కెరటానికి వచ్చిన నష్టమేమీ లేదు.. తిరిగి అంతే వేగంతో లేస్తుంది, తన సత్తా చూపిస్తుంది అని. సమంతని చూస్తే ఇప్పుడదే అనిపిస్తోంది. సినీ పరిశ్రమలో చాలా జంటలు విడాకులు తీసుకుంటాయి. కానీ ఎవరూ ఫేస్ చేయనన్ని అవమానాలు ఫేస్ చేసింది సమంత. ట్రోలర్ల వేధింపులు భరించలేక కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చిందామెకి.
అయితే అదంతా కొంతవరకే. కళ్లు మూసి తెరిచేలోగా తనను తాను సమస్య నుంచి తెలివిగా బైట పడేసుకుంది సామ్. పర్సనల్ విషయాలను పక్కన పెట్టేసింది. పనిపైనే దృష్టి పెట్టింది. కొత్త కొత్త ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతోంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ‘యశోద’, హాలీవుడ్‌లో ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ చిత్రాలతో పాటు అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో ఓ తమిళ మూవీకి కమిటయ్యింది. రీసెంట్‌గా ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసేసింది కూడా. ఇదంతా ఒకవైపు.
సమంత బాలీవుడ్ ప్రయత్నాలు మరోవైపు. ఇప్పటికే ‘ఫ్యామిలీ మేన్ 2’తో బాలీవుడ్ వారికి దగ్గరైన సామ్, ఇప్పుడు ఆ మేకర్స్ తీస్తున్న మరో వెబ్ సిరీస్‌కి కూడా కమిటయ్యింది. ‘అవెంజర్స్’ తీసిన రసో బ్రదర్స్ అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే అమెరికన్ యాక్షన్ సిరీస్ తీస్తున్నారు. ప్రియాంకా చోప్రా ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. అదే సిరీస్‌ని హిందీలోనూ తీయబోతోంది అమెజాన్. రాజ్, డీకే డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరో. ప్రియాంక పాత్రలో సమంత కనిపించబోతోంది. గూఢచారి పాత్రలో యాక్షన్ సీక్వెన్సులు కూడా అదరగొట్టనుంది.
ఇది మాత్రమే కాదు.. తాప్సీ నిర్మించే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటించబోతోంది సామ్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్టయ్యిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే సమంత ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో కలిగిన బాధ ఆమెని ఏమాత్రం వెనక్కి లాగలేదని అంతకంతకీ ముందుకెళ్తున్న సామ్‌ని చూస్తే అర్థమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:45 pm
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…
``తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు…
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ,…