Movie News

హీరో నాని ఎవరు? : YCP మంత్రి కౌంటర్

చాలా కాలంగా టాలీవుడ్ లో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తోంది. ఏపీలో ప్రభుత్వం నిర్ణయించే రేట్లకే సినిమా టికెట్లను అమ్మాలని జీవో జారీ చేయడం, దాన్ని కొందరు తారలు వ్యతిరేకించడం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం తప్ప.. మన తారలెవరూ కూడా ఈ విషయం మీడియా ముఖంగా మాట్లాడింది లేదు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం ఎప్పటికప్పుడు ఈ విషయంపై రియాక్ట్ అవుతూనే ఉన్నారు.

రీసెంట్ గా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ఆయన టికెట్ రేట్ ఇష్యూ గురించి మాట్లాడారు. థియేటర్లో రోజువారీ కలెక్షన్స్ కంటే.. పక్కనున్న కిరాణా షాపులకే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని ఆయన నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంలో చాలా మంది నానిని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ను విమర్శిస్తున్నారు.

ఇప్పటికే నానికి ఏపీ మంత్రులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నానిపై ఫైర్ అయ్యారు. హీరో నాని ఎవరో తనకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు అనిల్ కుమార్. తనకు తెలిసిందల్లా.. మంత్రి కొడాలి నాని మాత్రమేనని అన్నారు. కేవలం టికెట్ రేట్ తగ్గితే తమ రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధతో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. రూ.50 కోట్ల రెమ్యునరేషన్, ఇరవై లేదా ముప్పైకి తగ్గుతుందనే బాధ తప్ప.. వారి ఆవేదనలో అర్ధం లేదని అన్నారు. ‘భీమ్లానాయక్’, ‘వకీల్ సాబ్’ సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంత..? పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..? అని ప్రశ్నించారు. పవన్ తన క్రేజ్ ని అమ్ముకుంటున్నారని అన్నారు.

ఒకప్పుడు తాను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాకి కటౌట్ లు కట్టానని.. డబ్బులు ఊడగొట్టుకున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానుల పరిస్థితి కూడా ఇంతేనని అన్నారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కంటే రెమ్యునరేషన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుందని.. సినిమాకి అయ్యే ఖర్చులో ఎనభై శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయని.. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు అనిల్ కుమార్. ఇలాంటి వాళ్ల కోసం టికెట్ రేట్లు పెంచాలా..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

This post was last modified on December 24, 2021 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

5 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago