భీమ్లా నాయక్ వాయిదా పడిపోయింది కదా.. ఇంకేముంది బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసినట్లే అని అక్కినేని అభిమానులు సంబరపడిపోయారు. జనవరి 15న బంగార్రాజు రిలీజ్ అంటూ జోరుగా ప్రచారం జరిగిపోతోంది. కానీ బంగార్రాజు టీం నుంచి మాత్రం సౌండ్ లేదు. లాంఛనమే అనుకున్న రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు. ఐతే తాపీగా ఇంకొన్ని రోజుల తర్వాత విడుదల తేదీ ప్రకటించే స్కోప్ ఏమాత్రం లేదు.
సంక్రాంతికి పోటీ మామూలుగా ఉండట్లేదు. ఓవైపు ఆర్ఆర్ఆర్, ఇంకోవైపు రాధేశ్యామ్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజవుతున్నాయి. వాటికి పోను ఏమాత్రం థియేటర్లు మిగులుతాయన్నది సందేహమే. మరీ తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తే బంగార్రాజుకు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ సినిమా సంక్రాంతికే వస్తుందంటూ తన రెగ్యులర్ బయ్యర్లకు నాగ్ ఇంతకుముందే హామీ ఇచ్చి థియేటర్లు బుక్ చేసుకోమని చెప్పాడట.
కానీ అంత ఈజీగా అయితే స్క్రీన్లయితే దొరుకుతున్న పరిస్థితి లేదట. అసలు సినిమా ఇంకా పూర్తి కాకుండా, రిలీజ్ పక్కా అని తేలకుండా థియేటర్లు బుక్ చేయడం సమస్యగా ఉంది. ఇన్ని రోజులు అసలు భీమ్లా నాయక్ కూడా రేసులో ఉండటంతో థియేటర్ల బుకింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పుడా సినిమా రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. బంగార్రాజు విషయంలో అధికారిక ప్రకటన రాకుండా థియేటర్ల బుకింగ్ కష్టమవుతోంది.
నాగ్ చూస్తే షూటింగ్ అవ్వనీ, ఫస్ట్ కాపీ రానీ.. సోగ్గాడే చిన్నినాయనాకు చేసినట్లే కరెక్షన్లు అవీ చేసుకుని పక్కాగా సినిమాను రెడీ చేసి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ దానికి దొరికినంత సమయం దీనికి లభించేలా లేదు. సంక్రాంతికి వస్తే బాగుంటుందని హడావుడి పడి ఔట్ పుట్ బాగా లేని సినిమాను రిలీజ్ చేస్తే అసలుకే మోసం రావచ్చు. సినిమా బాలేకుంటే రెండు భారీ చిత్రాల మధ్య నలిగిగిపోతుంది. ఈ నేపథ్యంలో నాగ్ సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకుని బంగార్రాజు రిలీజ్ విషయంలో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు
This post was last modified on December 23, 2021 2:20 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…