రవితేజ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంతోమందికి ఫేవరేట్. జక్కన్న టేకింగ్.. డ్యూయెల్ రోల్‌లో మాస్ మహారాజా యాక్టింగ్ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశాయి. దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందనే కోరిక చాలామందిలో ఉంది. వారి ఆశ ఇప్పుడు నెరవేరబోతోంది. విక్రమార్కుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే తెలుగులో కాదు.. హిందీలో.
తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నింటినీ హిందీలోకి రీమేక్ చేసే బాలీవుడ్ వారు విక్రమార్కుడు చిత్రాన్నీ పట్టుకుపోయారు. అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ప్రెస్టీజియస్‌గా తీశారు. అది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్షయ్ కెరీర్‌లో భారీ హిట్ కొట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. త్వరలో సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల కన్‌ఫర్మ్ చేశారు.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో విక్రమార్కుడు సీక్వెల్‌కి సంబంధించిన టాపిక్ వచ్చింది. దాంతో సీక్వెల్‌కి స్టోరీ రెడీ చేస్తున్నట్లు చెప్పారు విజయేంద్ర ప్రసాద్. స్టోరీ రెడీ చేయమని సంజయ్ లీలా భన్సాలీ తనను సంప్రదించారని, తాను ఓకే అన్నానని, స్క్రిప్ట్ కూడా పూర్తి కావచ్చిందని ఆయన చెప్పారు. ఫస్ట్ పార్ట్‌లో నటించిన అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాల జోడీయే మళ్లీ నటిస్తుందట. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది. వచ్చే యేడు ప్రారంభంలోనే మూవీ సెట్స్‌కి వెళ్లే చాన్స్ ఉంది.
ఈ సినిమాకి సీక్వెల్‌ని కోరుకునే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామందే ఉన్నారు. పలుమార్లు ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. దీనిపై ఇండస్ట్రీలో చర్చలు కూడా జరిగాయి. అయితే రాజమౌళి మాత్రం ఇప్పటివరకు అలాంటి ప్లాన్ ఏదీ చేయలేదు. హిందీలో వచ్చేస్తోంది కాబట్టి బహుశా ఇక తెలుగులో వచ్చే చాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి రీమేక్స్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి.
This post was last modified on December 22, 2021 7:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…