ఓవైపు ఆర్ఆర్ఆర్.. ఇంకోవైపు రాధేశ్యామ్.. ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు చాలవన్నట్లు.. మరోవైపు భీమ్లా నాయక్.. ఇలాంటి మూడు భారీ చిత్రాలు సంక్రాంతికి ఖరారై ఉండగా.. అక్కినేని నాగార్జున సినిమా ‘బంగార్రాజు’కు చోటెక్కడుందో జనాలకు అర్థం కాలేదు. సంక్రాంతికి నూటికి నూరు శాతం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామన్న కాన్ఫిడెన్స్‌తో ఆయన కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలను రెగ్యులర్‌గా ఇచ్చే డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు చేసుకుని.. థియేటర్లు బుక్ చేసుకోమని చాలా ధీమాగా నాగ్ చెప్పడం పట్ల ఇండస్ట్రీ .జనాలు కూడా షాకయ్యారు. ఉన్న మూడు భారీ చిత్రాలకే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో తెలియని స్థితిలో నాగ్ ఏ ధీమాతో తన సినిమాను రేసులో నిలుపుతున్నాడో అర్థం కాలేదు. తీరా చూస్తే నాగ్ కాన్ఫిడెన్సే గెలిచింది. ‘బంగార్రాజు’కు సంక్రాంతి పోటీలో చోటు దక్కింది. లేదు లేదంటూనే చివరికి ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించేశారు.
ఆ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడిపోయింది. సంక్రాంతికి వారం ముందు ఆర్ఆర్ఆర్, సంక్రాంతి రోజు రాధేశ్యామ్ రాబోతున్నట్లు దిల్ రాజు నేతృత్వంలోని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారిక ప్రకటన చేసింది. ప్రెస్ మీట్లో ‘బంగార్రాజు’ ఊసేమీ ఎత్తలేదు. కానీ ఆ చిత్రం రాధేశ్యామ్ రిలీజైన ఒక్క రోజు తర్వాత థియేటర్లలో దిగబోతున్న మాట వాస్తవం. నాగ్ తన పలుకుబడితో ఈ సినిమా రేంజికి తగ్గట్లు ఓ మోస్తరు థియేటర్లలో రిలీజ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. తమది సంక్రాంతికి పక్కాగా సరిపోయే ఫ్యామిలీ మూవీ కావడంతో టాక్ ఆధారంగా తర్వాత థియేటర్లు పెంచుకోవచ్చనే ధీమాతో నాగ్ ఉన్నాడు.
సినిమాకు లాంగ్ రన్ ఉంటుందనే ధీమా ఆయనలో ఉంది. సంక్రాంతి సమయంలో సినిమా చూడటం తెలుగు వారికి ఒక ఆనవాయితీ కావడంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల కోసం వచ్చే వాళ్లు వాటి టికెట్ల దొరక్కపోయినా తన సినిమా వైపు చూస్తారన్న కాన్ఫిడెన్స్‌తోనూ నాగ్ తన చిత్రాన్ని రేసులో నిలుపుతున్నాడు. ఆయన నమ్మకం నిలబడి ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలోనే ‘బంగార్రాజు’ కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on December 21, 2021 1:12 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…