హీరోల కొడుకులు హీరోలవడం సాధారణమే. కానీ హీరోల కూతుళ్లు హీరోయిన్లవడం అరుదే. చాలామంది సినీ రంగంలోకి వచ్చినా.. వేరే విభాగాల వైపు వెళ్తుంటారు. కానీ రాజశేఖర్ కూతుళ్లు మాత్రం ఇద్దరూ నటన వైపే అడుగులు వేశారు.
కానీ ఈ ఇద్దరికీ అంతగా కలిసి రావడం లేదిక్కడ. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ‘2 స్టేట్స్’ రీమేక్‌తో కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘అద్భుతం’ అని సినిమా చేస్తే అది చాలా ఆలస్యంగా.. ఈ మధ్యే ఓటీటీలో రిలీజైంది.
దానికి స్పందన అంతంతమాత్రమే. ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’కు కూడా అంతగా బజ్ రాలేదు. దాన్ని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక తొలి చిత్రం ‘దొరసాని’ డిజాస్టర్ కావడం తెలిసిందే. మరో సినిమా ‘రంగమార్తాండ’ ఎంతకీ విడుదల కావట్లేదు. ఇదీ టాలీవుడ్లో ఈ ఇద్దరు వారసురాళ్ల పరిస్థితి.
ఐతే తెలుగులో కెరీర్ అంతంతమాత్రంగా ఉండగా.. వీళ్లిద్దరికీ తమిళంలో అవకాశాలు రావడం విశేషం. వీళ్లిద్దరూ నటించిన చిత్రాలు రెండు వారాల వ్యవధిలో తమిళనాట విడుదలవుతున్నాయి. శివాత్మిక తమిళంలో కథానాయికగా పరిచయం కానున్న ‘ఆనందం విలయాడుం వీడు’ ఈ నెల 24న థియేటర్లలోకి దిగబోతోంది.
ఇందులో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరో. ఇది పక్కా గ్రామీణ వాతావరణంలో నడిచే అరవ మార్కు మాస్ మూవీ. ఇందులో శివాత్మిక పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఈ సినిమా ప్రోమోలైతే బాగానే అనిపిస్తున్నాయి. మరోవైపు శివాని తమిళంలో ‘అన్బరివు’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇందులో సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ హీరో.
అతను ఇప్పటికే హీరోగా నటించిన సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. ఈ కొత్త చిత్రంలో అతను ద్విపాత్రాభినయం చేస్తుండగా.. శివాని మోడర్న్ అమ్మాయిగా పొట్టి డ్రెస్సుల్లో సెక్సీగా కనిపిస్తోంది. ఈ చిత్రం జనవరి 7న హాట్ స్టార్ ద్వారా రిలీజవుతోంది. శివాని మూడో చిత్రం కూడా ఓటీటీ బాటే పట్టడం విశేషం. మరి తెలుగులో ఆకట్టుకోలేకపోయిన రాజశేఖర్ కూతుళ్లు తమిళంలో అయినా తమదైన ముద్ర వేస్తారేమో చూడాలి.
This post was last modified on December 21, 2021 9:37 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…