Movie News

‘పుష్ప’కు గండి కొడుతున్న ‘ఆర్ఆర్ఆర్’

‘ఆర్ఆర్ఆర్’ కారణంగా ఆల్రెడీ ‘పుష్ప’కు ప్రమోషన్ల పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘పుష్ప’ ట్రైలర్ రిలీజైన మూడు రోజుల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ చేయడంతో ఫోకస్ మొత్తం దాని మీదికి వెళ్లిపోయింది. ట్రైలర్ లాంచ్ తర్వాత రెండు మూడు రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్’ టీం వరుసగా ప్రమోషన్లతో హోరెత్తించడంతో ‘పుష్ప’ అసలు వార్తల్లోనే లేకుండా పోయింది. తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ టీం కొంచెం వెనక్కి తగ్గడంతో ‘పుష్ప’ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం చుట్టూనే చర్చలన్నీ సాగాయి.

ఐతే ఇప్పుడు మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ టీం ‘పుష్ప’ మీది నుంచి ప్రేక్షకుల దృఫ్టిని మళ్లిస్తోంది. ముంబయిలో ఆదివారం జరగబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ ఉత్తరాదిన ‘పుష్ప’కు ఇబ్బందులు తెచ్చేలా ఉంది. ఈ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా రాబోతుండటం, ఈవెంట్ భారీ స్థాయిలో చేస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. కలెక్షన్ల పరంగా కూడా ‘పుష్ప’కు ‘ఆర్ఆర్ఆర్’ గండి కొడుతుండటం గమనార్హం. ఐతే ఆ గండి పడుతోంది ఇండియాలో కాదు.. యుఎస్‌లో. యుఎస్‌లో భారీ చిత్రాల విడుదలకు వారం, రెండు వారాల ముందే బుకింగ్స్ మొదలవుతుంటాయి. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఉన్న అంచనాల దృష్ట్యా మూడు వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టేశారు. ‘పుష్ప’ రిలీజ్ రోజు నుంచే కొన్ని స్క్రీన్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇలా పెట్టడం ఆలస్యం అలా టికెట్లు అయిపోతున్నాయి. 20వ తారీఖు నుంచి మొత్తం అన్ని స్క్రీన్లలో బుకింగ్స్ మొదలవుతున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లే రేట్లు కూడా కాస్త ఎక్కువే.

ఐతే ఈ చిత్రం కోసం ఒక్కో టికెట్‌కు 25-35 డాలర్ల మధ్య ఖర్చు చేస్తున్న ఎన్నారైలు.. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘పుష్ప’ మీద మళ్లీ బడ్జెట్ పెట్టడానికి కొంచెం సందేహిస్తారనడంలో సందేహం లేదు. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ రావడం కూడా మైనస్ అయింది. ‘ఆర్ఆర్ఆర్’ బుకింగ్స్ ఓపెన్ కాకుంటే.. ‘పుష్ప’ మీదే వాళ్ల ఫోకస్ ఉండేది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా కీలకమైన రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బుకింగ్స్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది. దీని వల్ల కచ్చితంగా ‘పుష్ప’ కలెక్షన్లపై ప్రభావం పడుతోందంటున్నారు ట్రేడ్ పండిట్లు.

This post was last modified on December 19, 2021 7:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల టికెట్లను అమ్ముకుని రోజా బెంజి కారు కొనుక్కుంది

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు…

22 minutes ago

పాక్ సుడి తిరిగింది: నదిలో 33 టన్నుల బంగారు నిల్వలు

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్…

58 minutes ago

చెప్పడానికి ఏం లేదు.. అంతా బూడిదే!!

అగ్ర‌రాజ్యం అమెరికాలో ధ‌నవంతులు నివ‌సించే ప్రాంతం అది! క‌డుక్కున్న కాళ్ల‌తో అక్క‌డ అడుగులు వేసినా ముద్ర‌ప‌డ‌తాయేమో.. మ‌ట్టి అంటుతుందేమో.. అని…

1 hour ago

రేప‌టి నుంచి మ‌హా కుంభ‌మేళా… భారీ ఏర్పాట్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌విత్ర ప్ర‌యాగ్‌రాజ్ జిల్లాలో సోమ‌వారం(జ‌న‌వ‌రి 13) నుంచి 45 రోజుల పాటు జ‌ర‌గ‌ను న్న మ‌హా కుంభ‌మేళాకు స‌ర్వం…

2 hours ago

సమీక్ష – డాకు మహారాజ్

సీనియర్ స్టార్ హీరోల్లో వరసగా మూడు బ్లాక్ బస్టర్లున్న హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే. రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం…

5 hours ago

90 గంటల పనిపై ఆనంద్ మహీంద్ర: ఇచ్చిపడేశాడు!

కార్పొరేట్ కంపెనీలు ఇటీవల కాలంలో పని ఒత్తిడితో పాటు టైమ్ ను కూడా మెల్లగా పెంచుతున్న విధానంపై తీవ్ర స్థాయిలో…

5 hours ago