త్రివిక్రమ్ తప్పుకున్నాడా… తప్పించుకున్నారా?

పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందనే ఐడియా త్రివిక్రమ్ కే ముందుగా వచ్చిందట. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఇమేజ్ కి ఇలాంటి బర్నింగ్ ఇష్యూ మీద సినిమా అయితే బాగుంటుందని త్రివిక్రమ్ సలహా ఇచ్చాడట. పవన్ కూడా ఆ సినిమా చూసి చేస్తానని చెప్పాడట.

అలా వకీల్ సాబ్ కి బీజం వేసింది త్రివిక్రమ్ అన్నమాట. ఆయన ఈ సినిమాకు మాటలు రాయడంతో పాటు నిర్మాణంలో భాగస్వామ్యం కూడా అడిగాడట.

దిల్ రాజు అందుకు అయిష్టంగా అంగీకరించినా కానీ అల వైకుంఠపురములో సినిమా బిజీలో త్రివిక్రమ్ ఉండడంతో సైలెంట్ గా శ్రీరామ్ వేణుతో స్క్రిప్ట్ రాయించేసాడనే గుసగుసలున్నాయి. బిజీగా ఉండడం వల్ల త్రివిక్రమ్ సమయానికి దొరకలేదని వేణు చెబుతున్నాడు.

ఆల్రెడీ బోనీ కపూర్ తో వాటా ఉండడంతో మళ్ళీ మరో వాటా దేనికని దిల్ రాజు తెలివిగా త్రివిక్రమ్ ని సైడ్ చేసాడనే టాక్ అయితే ఇండస్ట్రీలో గట్టిగా ఉంది. అల అంత పెద్ద హిట్ అవడంతో ఆ ఉత్సాహంలో త్రివిక్రమ్ ఇదంతా అంత సీరియస్ గా తీసుకోలేదట.