Movie News

రవితేజతో గొడవ.. చెక్ పెట్టనున్న బాలయ్య!

ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ పక్క సినిమాలతో పాటు ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలయ్య లాంటి అగ్ర హీరో తన హోస్టింగ్ స్కిల్స్ తో షో రేంజ్ ని పెంచేశారు.

ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, రాజమౌళి ఇలా పేరున్న తారలను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.
త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ షోలో కనిపించబోతున్నారు. కానీ ఆ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఈ షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నారట. గతంలో రవితేజ, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. రవితేజ మెగా కాంపౌండ్ మనిషని.. అందుకే బాలయ్యతో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా ప్రచారం జరిగేది.

దానికి తగ్గట్లే.. వీరిద్దరూ కూడా ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇప్పుడు ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టనున్నారు బాలయ్య. రవితేజతో కలిసి ఒకే వేదికపై కనిపించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అది కూడా ‘అన్ స్టాపబుల్’ షోలో కావడం విశేషం. ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలి మరి!

This post was last modified on December 18, 2021 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago