టాలీవుడ్ లో పూజాహెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. ఇద్దరూ కూడా టాప్ హీరోలతో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. కానీ రష్మికతో పోలిస్తే పూజాహెగ్డే క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. యూత్ లో పూజాకి మంచి ఫాలోయింగ్ ఉంది.
రష్మిక ఇప్పుడిప్పుడే క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా.. పూజాహెగ్డేకి రావాల్సిన కొన్ని బ్రాండ్స్ ని రష్మిక కొట్టేస్తుందని సమాచారం. మన తారలు సినిమాల్లో నటించడంతో పాటు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తుంటారు.
రీసెంట్ గానే రష్మిక లాట్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజానికి ముందుగా ఈ ఆఫర్ పూజాహెగ్డే దగ్గరకు వెళ్లిందట. ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. రష్మిక రూ.50 లక్షలకే చేస్తానని ఆఫర్ చేయడంతో ఆ బ్రాండ్ రష్మిక చేతులోకి వచ్చిందట.
ఇప్పుడు పూజాని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్న కొన్ని కంపెనీలు రష్మిక తక్కువ రెమ్యునరేషన్ కి ఒప్పుకుంటుందని తెలుసుకొని.. ముందుగా ఆమె దగ్గరకు వెళ్తున్నారట. ఆ విధంగా పూజాకి వెళ్లాల్సిన బ్రాండ్స్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
This post was last modified on December 18, 2021 12:41 pm
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు…