తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంతవరకు సూపర్ స్టారే కెప్టెన్. దర్శకుడో, నిర్మాతో కెప్టెన్ అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అంతే. స్టార్ హీరో ఏది తలుచుకుంటే అదే అవుతుంది. ఎవరైనా అందుకు అనుగుణంగా ఆడాల్సిందే.
వాళ్ళు ఏ దర్శకుడితో చేద్దామనుకుంటే వాళ్ళతో చేయగలరు, అలాగే తమ సినిమాకు ఎంతమంది నిర్మాతలు ఉండాలనేది కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు. చివరకు వేరే సినిమా కమిట్ అయిన దర్శకుడు, నిర్మతను కూడా తమవైపు ఎప్పుడంటే అప్పుడు లాక్కోగలరు.
సర్కారు వారి పాట చిత్రానికి షిఫ్ట్ అయిన పరశురామ్ నిజానికి నాగ చైతన్యతో సినిమా కమిట్ అయ్యాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో అది అధికారికంగా ప్రకటించారు. కానీ మహేష్ తనతో సినిమా చేస్తానని చెప్పడంతో పరశురామ్ అటు వెళ్ళిపోయాడు. ఆ నిర్మాతలు కూడా పెద్ద సినిమా అని అటు షిఫ్ట్ అయిపోయారు.
కానీ చైతన్య గురించి పట్టించుకోలేదు. గీత గోవిందం దర్శకుడి సినిమా అని చైతన్య ఫాన్స్ ఆనందపడ్డారు. కానీ అది ఇక ఉండదు. అయితే చైతన్య మీడియం రేంజ్ హీరో కనుక ఈ మేటర్ వరకు మహేష్ ఏది అనుకుంటే అదే జరిగింది. అదే స్టార్ హీరో సినిమా అయితే ఇలా చేతులు మారి ఉండేదా?