యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కమర్షియల్ ఫార్మాట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ శ్రీవిష్ణు రూటే వేరు. హీరోయిజం కోసం పాకులాడడు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండి తీరాలనే నియమాలేమీ పెట్టుకోడు.
కామెడీ, రొమాన్స్ కచ్చితంగా కావాలనుకోడు. దీనివల్ల అతను టాప్ హీరో కాలేకపోవచ్చు. కానీ మంచి సినిమాలు చేస్తాడనే పేరైతే తెచ్చుకున్నాడు. ఈ నెలాఖరుకి మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీవిష్ణు హీరోగా తేజ మార్ని డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అర్జున ఫల్గుణ’ మూవీని డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అర్జునుడు సమరానికి సిద్ధమయ్యాడు, చూడటానికి రెడీ అవ్వమంటున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నరేష్, శివాజీ రాజా, దేవీప్రసాద్, సుబ్బరాజు, మహేష్ తదితరులు నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. పి.సుధీర్ వర్మ డైలాగ్స్ రాశాడు. నిజానికి ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.
అది నిజం కాదని ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టైటిల్‌తో పాటు పాటలు, టీజర్ కూడా ఇంప్రెస్ చేశాయి. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడనే ఫీల్‌ని కలిగించాయి. సినిమా చూశాక కూడా అదే ఫీల్ కలిగితే శ్రీవిష్ణుకి గత చిత్రం ‘రాజ రాజ చోర’తో వచ్చిన సక్సెస్ కంటిన్యూ అవ్వడం ఖాయం.
This post was last modified on December 16, 2021 2:45 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…