అల్లరి నరేష్ కెరీర్-ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్లో వచ్చిన బెండు అప్పారావ్ ఆర్ఎంపీ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన మేఘనా రాజ్ గుర్తుందా? ఈ అమ్మాయి స్వస్థలం బెంగళూరు. తెలుగులో బ్రేక్ రాకపోవడంతో కన్నడ సినిమాలకే పరిమితం అయింది. అక్కడ మంచి స్థాయినే అందుకుంది. ఈ అమ్మాయికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయే పరిణామం జరిగింది.
ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించిన చిరంజీవి సర్జా.. మేఘన భర్త. సీనియర్ హీరో అర్జున్‌కు మేనల్లుడు కూడా అయిన చిరంజీవి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద షాకే. అతడి వయసు 39 ఏళ్లే. ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవంటున్నారు. కానీ ఇలా ఎందుకు జరిగిందో ఏమో?
చిరంజీవి సర్జాతో మేఘన పదేళ్ల పాటు ప్రేమలో ఉండటం విశేషం. హీరో హీరోయిన్లుగా ఇద్దరి కెరీర్ బాగా నడుస్తుండటంతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరికి 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇద్దరివీ సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలే. మేఘన తండ్రి సుందర్ రాజ్ కన్నడలో ప్రముఖ నటుడు.
పెళ్లి తర్వాత చిరంజీవి, మేఘన చాలా సంతోషంగా గడపుతూ తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లు. వారం కిందట కూడా కలిసి డిన్నర్ చేస్తూ ఫొటో షేర్ చేశారు. అందులో చిరంజీవి చాలా హుషారుగా కనిపించాడు. ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న విషయం ఏంటంటే.. మేఘన ప్రెగ్నెంట్ కూడా అట. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్న వీరి కుటుంబాలు ఇప్పుడు పెను విషాదంలో మునిగిపోయాయి. మేఘన పరిస్థితి చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
This post was last modified on June 8, 2020 9:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…