రాజమౌళి ప్రతి సినిమాకూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కానీ ఆ అంచనాలను మించిపోయే సినిమాను అందించి ఆశ్చర్యపరుస్తుంటాడు జక్కన్న. కేవలం సినిమాలు అత్యద్భుతంగా తీయడమే కాదు.. వాటిని మార్కెట్ చేయడంలోనూ రాజమౌళి తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. సినిమా మేకింగ్ దశలో ఉండగానే ప్రమోషన్లు హోరెత్తిస్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి బిజినెస్ డీల్స్‌ను కూడా రాజమౌళే దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాడని అంటారు.
బాహుబలి నిర్మాతలు కొత్త వాళ్లయినా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ దానయ్యకు తెలుగు రాష్ట్రాల అవతల మార్కెట్‌పై పెద్దగా అవగాహన లేకపోయినా.. ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ తెచ్చుకుందన్నా, భారీ డీల్స్ జరిగాయన్నా, ప్రమోషన్లు ఒక రేంజిలో జరుగుతున్నాయన్నా అందులో రాజమౌళి పాత్ర కీలకం అన్నది స్పష్టం.
ఇక ఒక బిజినెస్ డీల్ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వేసిన అడుగు.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఖరారవ్వగానే పీవీఆర్ సినిమాస్‌తో చిత్ర బృందం డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ ఛైన్‌తో ఒప్పందమేంటి.. ఎలాగూ ఏ సినిమా అయినా మిగతా మల్టీప్లెక్సుల్లో మాదిరే పీవీఆర్‌లోనూ రిలీజవుతుంది కదా.. దీనికి ప్రత్యేకంగా డీల్ ఏంటి అనుకున్నారు. కానీ దీని వెనుక రాజమౌళి స్ట్రాటజీ ఉందని సమాచారం. ఆర్ఆర్ఆర్ సంక్రాంతి సీజన్లో రాబోతుండటంతో దానికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉంది.
రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలు పోటీకి సై అంటున్నాయి. తమిళంలో వలిమైతోనూ పోటీ తప్పదు. ఐతే దేశంలోనే అతి పెద్ద థియేట్రికల్ ఛైన్ ఉన్న పీవీఆర్‌తో ఆర్ఆర్ఆర్‌కు డీల్ ఉండటంతో పోటీలో ఏ సినిమాలున్నా.. రెండు మూడు వారాల పాటు ఆర్ఆర్ఆర్‌కే మేజర్ స్క్రీన్లు ఇస్తారు. వేరే చిత్రాల కోసం రాజీ పడే ఛాన్సే ఉండదు. ఇక రిలీజ్‌కు ముందు రెండు నెలల నుంచి పీవీఆర్‌లో ప్రతి షోలోనూ ఆర్ఆర్ఆర్ ప్రోమోలతో హోరెత్తించేస్తున్నారు. ఆ రకంగా ప్రమోషన్ గట్టిగా జరుగుతుంది. దీన్ని బట్టి రాజమౌళితో అంత వీజీ కాదనే విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిందే.
This post was last modified on December 14, 2021 9:09 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…