అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రణాళికలు మారిపోతున్నట్లే ఉన్నాయి. ‘పుష్ప’ పార్ట్-1 పూర్తి చేశాక.. ‘పార్ట్-2’ చేయడానికి ముందు అతను ఐదారు నెలలు గ్యాప్ తీసుకుంటాడని.. వేరే సినిమాలో నటిస్తాడని.. ఆ సినిమా పూర్తయ్యాక ‘పుష్ప-2’ సెట్స్‌లో అడుగు పెడతాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. బన్నీ సన్నిహిత వర్గాల నుంచి.. అలాగే ‘పుష్ప’ యూనిట్ నుంచి కూడా మీడియాకు ఈ రకమైన సమాచారమే వచ్చింది.
బన్నీ ఈ గ్యాప్‌లో చేయబోయే సినిమా ‘ఐకాన్’ అని కూడా చెప్పుకున్నారు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ తీరా చూస్తే ‘ఐకాన్’ మరోసారి హోల్డ్‌లో పడుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ విషయంలో ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ‘పుష్ప-2’ షూటింగ్ గురించి ఈ చిత్ర నిర్మాతలు ఇచ్చిన అప్‌డేటే ఇందుకు రుజువు.
‘పుష్ప-2’ షూటింగ్ ఫిబ్రవరి నుంచే మొదలు కానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు క్లారిటీ ఇచ్చేశారు. అంటే ‘పుష్ప-1’ విడుదల తర్వాత బన్నీ ఇంకో సినిమా చేసే ఉద్దేశమేమీ లేదన్నట్లే. వచ్చే రెండు నెలలు అతను విశ్రాంతి తీసుకోబోతున్నాడన్నమాట. ‘పుష్ప’ లుక్‌ను కూడా బన్నీ అలాగే మెయింటైన్ చేస్తాడని.. జుట్టు, గడ్డం తీయబోడని తెలుస్తోంది. మళ్లీ ఈ స్థాయిలో జుట్టు, గడ్డం పెంచాలంటే నెలల సమయం పడుతుంది కాబట్టి బన్నీ ప్రస్తుత లుక్‌ను అలాగే మెయింటైన్ చేయబోతున్నాడు. మధ్యలో వేరే సినిమా ఏదీ పెట్టుకోవట్లేదు.
కాబట్టి ‘ఐకాన్’ అటకెక్కేసినట్లే అనుకోవాలి. ‘పుష్ప-2’ కూడా అయ్యాక తన తర్వాతి సినిమాపై బన్నీ ఏదో ఒకటి తేల్చుకునే అవకాశముంది. కొరటాల శివతో అనుకున్న సినిమా మీదా ఇప్పుడు అయోమయం నెలకొంది. బన్నీ ‘పుష్ప-2’ పూర్తి చేసి.. మరోవైపు కొరటాల తారక్ సినిమాను అవగొట్టి.. ఇద్దరికీ అప్పుడు కుదిరితే తమ కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతారేమో.
This post was last modified on December 11, 2021 10:47 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…