‘బాహుబలి’ లాంటి సినిమా ఇంకోటి రాదని బలంగా ఫిక్సయిపోయి ఉన్నారు ప్రేక్షకులు. గత కొన్నేళ్లలో ‘బాహుబలి’ని టార్గెట్ చేస్తూ వివిధ భాషల్లో అలాంటి భారీ చిత్రాలు కొన్ని వచ్చాయి. కానీ ఏవీ దానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. స్వయంగా రాజమౌళి కూడా అలాంటి అద్భుతాన్ని మళ్లీ ఆవిష్కరించలేడనే అభిప్రాయంతో ఉన్నారు ప్రేక్షకులు. జక్కన్న నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ దాని స్థాయిలో బాగానే హైప్ తెచ్చుకున్నప్పటికీ.. ‘బాహుబలి’ స్థాయి యుఫోరియా దీనికి కూడా సాధ్యం కాదని, ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడం కష్టమే అని భావిస్తున్నారు.
ఐతే విజువల్‌గా ఆర్ఆర్ఆర్.. బాహుబలిని మ్యాచ్ చేయలేకపోవచ్చేమో కానీ.. ఎమోషన్ల పరంగా ఇది ‘బాహుబలి’ని మించిన సినిమానేనట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా రాజమౌళే. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఈ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
“ఎమోషన్ల వరకు తీసుకుంటే కచ్చితంగా ఆర్ఆర్ఆర్.. బాహుబలిని మించే ఉంటుంది కానీ అంతకంటే తగ్గదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా అంగీకరిస్తారని చాలా నమ్మకంతో ఉన్నాను” అని రాజమౌళి చెప్పాడు. ఈ మాట అనాలంటే చాలా ధైర్యం కావాలి. ‘బాహుబలి’ కేవలం విజువల్ మాయాజాలంతో హిట్టయిపోలేదు. అందులోని ఎమోషన్లు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. మరి దాన్ని మించిన ఎమోషన్లు ‘ఆర్ఆర్ఆర్’లో ఉన్నాయని రాజమౌళి అన్నాడంటే సాహసమనే చెప్పాలి.
ఐతే జక్కన్న ఊరికే హైప్ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే రకం కాదు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ ఎమోషన్లతో ప్రేక్షకులను ఊపేయడం ఖాయం అనుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను చేయబోయేది మహేష్ సినిమానే అని మరోసారి రాజమౌళి ధ్రువీకరించాడు. కానీ ఆ సినిమా గురించి ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించే, మాట్లాడే పరిస్థితి లేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా ‘ఆర్ఆర్ఆర్’ మీదే ఉందని.. ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలని.. రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి తాము అనుకున్న స్థాయిలో స్పందన వచ్చాక.. అప్పుడు మహేష్ మూవీ గురించి ఆలోచిస్తానని చెప్పాడు జక్కన్న.
.
This post was last modified on December 11, 2021 10:33 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…