బయట మెగా, నందమూరి అభిమానులు తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. నిజానికి హీరోల మధ్య పెద్దగా శత్రుత్వం ఏమీ కనిపించదు. వాళ్లు కలిసినపుడు సరదాగానే మాట్లాడుకుంటారు. ఒకరితో ఒకరు ఆత్మీయంగానే మెలుగుతారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఎప్పట్నుంచో వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఇద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు పని చేయడం మొదలుపెట్టాక వారి స్నేహం మరో స్థాయికి వెళ్లింది. ఆ స్నేహ బంధమే సినిమాకు ఎంతో ఉపయోగపడిందని కూడా ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల సందర్భంగా వీళ్లిద్దరి తీరు చూస్తే.. ఈ సినిమా సందర్భంగా వారి బంధం మరింత బలపడిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. స్నేహం అంటే కేవలం సన్నిహితంగా మెలగడమే కాదు.. ఇద్దరూ ఒకరినొకరు ఏడిపించుకోవడం.. కలిసి అల్లరి చేయడం.. ఒకరిపై ఒకరు రాజమౌళికి కంప్లైంట్ చేసుకోవడం.. ఇంకా చాలా వ్యవహారాలే ఉన్నాయట.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా తారక్, చరణ్ ఎంతటి అల్లరివారో రాజమౌళి స్వయంగా వెల్లడించాడు.
మీ హీరోలతో షూటింగ్ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని విలేకరులు రాజమౌళిని అడిగితే.. ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘వీళ్లిద్దరితో ఎన్ని ప్రాబ్లెమ్స్ అంటే.. ఈ సినిమా షూటింగ్ 300 రోజులు చేస్తే అందులో 20-25 రోజులు వీళ్లిద్దరి మూలంగా వేస్ట్ అయ్యాయి’’ అని రాజమౌళి అంటుండగా.. పక్కనే ఉన్న తారక్ జక్కన్న నడుం మీద చేయి వేసి గిల్లేశాడు. దీంతో రాజమౌళి నవ్వుకుంటూ లేచి దూరంగా వెళ్లి తన సమాధానాన్ని కొనసాగించారు. ‘‘సరిగ్గా ఇద్దరూ ఇలాగే చేసేవాళ్లు. ఇద్దరికీ 30 ఏళ్లు పైన వచ్చాయి. పెళ్లిళ్లయినాయి. వెనకాల బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షలు, కోట్ల మంది అభిమానులున్నారు. అన్నా చచ్చిపోతాం అన్నా చచ్చిపోతాం అనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సెట్లో చరణ్ గిల్లుతున్నాడు అని తారక్ వచ్చి కంప్లైంట్ చేస్తాడు. చరణ్‌ను అడిగితే అమాయకంగా ఫేస్ పెట్టి లేదే.. నేను లైవ్ చూసుకుంటున్నానే అని ఫోన్ చూపిస్తాడు. ప్రతిసారీ 10-15 నిమిషాలు వెళ్తుందిది. ఎక్కడ, ఎలా ఆపాలో తెలియదు’’ అని రాజమౌళి అంటుండగా.. ‘‘మీరు చూడలేదా.. చూసి ఏం చేశారు’’ అంటూ తారక్ సరదాగా నిలదీశాడు. ఈ సంగతిలా ఉంటే.. ప్రెస్ మీట్ అంతా అయ్యి తారక్, చరణ్ కలిసి ఫొటోలకు పోజులిచ్చే టైంలో చరణ్ వెనుక నుంచి తారక్‌ను గిల్లడం.. అతను ఉలిక్కి పడి చరణ్‌ను నడుంతో ఢీకొట్టడం చూసి ప్రెస్ మీట్లో అందరూ గొల్లుమన్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on December 11, 2021 2:36 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…