మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు స్పీడులో లేరు. ఒకేసారి నాలుగు చిత్రాల షూటింగ్‌లో ఆయన పాల్గొంటుండటం విశేషం. ‘ఆచార్య’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంటే దాని కోసం చిరు పని చేస్తున్నారు. అలాగే మరోవైపు మూడు కొత్త చిత్రాలను లైన్లో పెట్టిన ఆయన.. సమాంతరంగా వాటి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో ఒకటి బాబీ దర్శకత్వంలో చేస్తున్నది.
ఇటీవలే దీని షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌కు వీరాభిమానిగా.. ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించబోతున్నానంటూ బాబీ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ ఇచ్చినా పూనకాలు పూనకాలు అనే మాటే వినిపిస్తోంది.
ఈ సినిమా ప్రి లుక్ చూస్తేనే ఇది కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా అనే విషయం అర్థమవుతోంది.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ రూమర్ బయటికి వచ్చింది. ప్రి లుక్ చూస్తే ‘ముఠామేస్త్రి’ తరహా లుక్‌లో చిరు కనిపించగా.. పోర్టులో పని చేసే కూలీ పాత్రను చిరు చేస్తున్నాడేమో అనిపించింది. ఐతే పైకి ఈ పాత్ర ఇలా ఉన్నప్పటికీ దాని అంతరంగం వేరట. చిరు ఇందులో అండర్ కవర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాట. ఇంటర్వెల్ వరకు ఊర మాస్‌గా కనిపించే చిరు ఆ తర్వాత పోలీస్ అవతారంలో కనిపిస్తాడని.. సెకండాఫ్ ఆ లుక్‌లోనే కనిపిస్తాడని అంటున్నారు.
ఇక ఈ చిత్రానికి శ్రీలంక నేపథ్యాన్ని బాబీ జోడించాడని.. అది సినిమాలో ఒక హైలైట్‌గా ఉంటుందని సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు చిరు గాడ్ ఫాదర్, బోళాశంకర్ సినిమాలలో నటిస్తుండటం తెలిసిందే.
This post was last modified on December 8, 2021 5:14 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…