బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిన్ననే ఇటు కుటుంబ సభ్యులు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం సంగీత్ పార్టీ జరగనుంది. ఇలాంటి సమయంలో వీరి పెళ్లిపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. రాజస్థాన్ కు చెందిన లాయర్ నేత్రబింద్ సింగ్ ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.
దానికి కారణమేంటంటే.. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు ఆనుకొని ఫేమస్ దేవీ మాత ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్లాలంటే రిసార్ట్ ను దాటుకొని వెళ్లాలి. అయితే కత్రినా-విక్కీ పెళ్లిని దృష్టిలో పెట్టుకొని రిసార్ట్ నిర్వాహకులు ఆ దారిని బ్లాక్ చేశారు. దీంతో వందలాది మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.
దీంతో లాయర్ నేత్రబింద్ సింగ్ కత్రినా – విక్కీ పెళ్లిపై ఫిర్యాదు చేశారు. ఒకట్రెండు రోజులు ఆలయానికి దారి మూసేస్తే సరిపెట్టుకోవచ్చు కానీ 6వ తేదీ నుంచి ఆ దారి మూసేశారని.. తిరిగి 12వ తేదీ సాయంత్రం తెరుస్తారట అని చెప్పుకొచ్చారు నేత్రబింద్.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ దారి మూసేయడం నేత్రబింద్ సింగ్ కి నచ్చలేదట. రోజుకి వందల మంది భక్తులు వచ్చే దారిని మూసేసి వారి మనోభావాలను హర్ట్ చేస్తున్నారంటూ.. ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంలో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ రిసార్ట్ కు నోటీసులు అందాయి. ఇక కత్రినా -విక్కీ వివాహం చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు హోటల్ కు చేరుకుంటున్నారు.
This post was last modified on December 7, 2021 2:26 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…