గుడ్ లక్ సఖి.. ఎప్పుడో రెండేళ్ల ముందు మొదలైన సినిమా. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో.. హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి విలక్షణ చిత్రాలు తీసిన సీనియర్ దర్శకుడు నగేష్ కుకునూర్ రూపొందించిన సినిమా ఇది. ఐతే కరోనా వల్ల, వేరే కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఒక దశలో ఈ సినిమా అస్సలు వార్తల్లో లేక అందరూ దీని గురించి మరిచిపోయారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవుతుందన్న వార్తలు కూడా నిజం కాలేదు.
చివరికి గత నెలలోనే ఈ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నవంబరు 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. కానీ ఆ తేదీకి సినిమా రాలేదు. ఆ తర్వాత డిసెంబరు 10కి డేట్ మార్చారు. మొన్నటి దాకా ఈ డేట్‌కే కట్టుబడి ప్రమోషన్లు కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో.. ‘గుడ్ లక్ సఖి’ని మళ్లీ వాయిదా వేశారు. ఈసారి ఇచ్చిన కొత్త డేట్.. డిసెంబరు 31.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘అఖండ’ సాగిస్తున్న ప్రభంజనం చూసి భయపడే ‘గుడ్ లక్ సఖి’ని వాయిదా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వారం దానికి పోటీగా వచ్చిన మరక్కార్, స్కైలాబ్ అడ్రస్ లేకుండా పోయాయి. నాలుగు రోజులు గడిచినా ‘అఖండ’ జోరు తగ్గట్లేదు. వీక్ డేస్‌లో కొంచెం జోరు తగ్గినా రెండో వీకెండ్లో ఈ సినిమా మళ్లీ దూకుడు చూపించే అవకాశాలున్నాయి.
నాగశౌర్య సినిమా ‘లక్ష్య’ కూడా బరిలో ఉండటంతో ‘గుడ్ లక్ సఖి’ లాంటి బజ్ లేని మూవీని జనాలు పట్టించుకోకపోవచ్చు. అందుకే సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తర్వాతి రెండు వారాలకు బెర్తులు బుక్ అయిపోవడంతో ఖాళీగా ఉన్న డిసెంబరు 31వ తేదీని ఎంచుకున్నట్లున్నారు. కానీ ఇన్నిసార్లు వాయిదా పడ్డ సినిమా ఆ రోజైనా కచ్చితంగా రిలీజవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. చూడాలి మరి ‘గుడ్ లక్ సఖి’కి ఎప్పుడు మోక్షం లభిస్తుందో?
This post was last modified on December 5, 2021 10:25 pm
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…