బాహుబలి సినిమా చూసి స్ఫూర్తి పొందిన వాళ్లున్నారు. దాన్ని చూసి అసూయ చెందిన వాళ్లూ ఉన్నారు. స్ఫూర్తి పొందిన వాళ్లు తాము కూడా అలాంటి భారీ ప్రయత్నాలు చేయాలని సిన్సియర్‌గా ట్రై చేశారు. అసూయ చెందిన వాళ్లు ఇలాంటి మేం తీయలేమా అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందడుగు వేశారు. కానీ ఎవ్వరూ కూడా రాజమౌళిలా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారు. వివిధ భాషల్లో వచ్చిన బాహుబలి తరహా భారీ చిత్రాల్లో ఒక్కటి కూడా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. ఇప్పుడు ఈ జాబితాలో మరో చిత్రం చేరింది.
అదే.. మరక్కార్. దీన్ని మలయాళ బాహుబలిగా పేర్కొంటూ వచ్చారు అందరూ. మలయాళ సినీ పరిశ్రమ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడ నంబర్ వన్ హీరో అయిన మోహన్ లాల్.. ఆ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో ఒకడైన ప్రియదర్శన్ కలిసి చేసిన భారీ ప్రయత్నిమిది.మలయాళ పరిశ్రమ స్థాయికి మించి వంద కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘బాహుబలి’ సహా ఎన్నో భారీ చిత్రాలకు పని చేసిన సాబు సిరిల్ దీనికి ప్రొడక్షన్ డిజైన్ అందించారు. కీర్తి సురేష్, ప్రభు, అర్జున్, సిద్ధిఖ్, నెడుముడి వేణు.. ఇలా భారీ తారాగణమే ఉందీ చిత్రంలో.
ప్రోమోల్లో విజువల్స్ చూసి ఇది బాహుబలి స్థాయికి ఏమాత్రం తగ్గని చిత్రం అనుకున్నారు. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్’తోనూ పోలికలు కనిపించాయి. విడుదలకు ముందే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా అందుకోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేశారు. కానీ తీరా చూస్తే.. సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కథలో దమ్ము లేదు. కథనంలో ఊపు లేదు. హీరో ఎలివేషన్లు లేవు. డ్రామా పండలేదు.
యాక్షన్ ఘట్టాలు అనుకున్నంత లేవు. విజువల్స్ కొంత గ్రాండ్‌గా కనిపించాయి తప్ప ఇంకే హైలైట్లూ లేవు ఈ చిత్రంలో. ఈ సినిమా చూశాక రాజమౌళి గొప్పదనం ఏంటన్నది మరోసారి జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. కేవలం భారీగా ఖర్చు పెట్టినంత మాత్రాన రాజమౌళిలా అందరూ అదిరే ఔట్ పుట్ తీసుకురాలేరని.. ఆయనలా ప్రేక్షకులను ఉద్రేకానికి, ఉద్వేగానికి గురి చేయడం అందరికీ సాధ్యం కాదని.. హీరో ఎలివేషన్లలో, ఎమోషన్లు పండించడంలో, యాక్షన్ ఘట్టాలను రోమాంచితంగా తీర్చిదిద్దడంలో రాజమౌళికి రాజమౌళే సాటని.. ఆయనలా మరే దర్శకుడూ అన్ని రసాలనూ పండించలేడని, తెరపై భారీతనాన్ని తీసుకురాలేరని అర్థమైపోయింది.
This post was last modified on December 5, 2021 3:18 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…